Health

దీర్ఘకాలిక కీళ్ల నొప్పులను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు.

చలికాలంలో కీళ్ల చుట్టూ రక్తనాళాలు గట్టిపడతాయి. దీంతో ఆర్థరైటిస్ సమస్య ఎక్కువ అవుతుంది. అయితే ఈ నొప్పులను కొన్ని చిట్కాల ద్వారా సులువుగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. వీటివల్ల మంట, ఆర్థరైటివ్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులను తగ్గుతాయి. అయితే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఇంటి నివారణలు.. వేడి, చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

వాపు ఎక్కువగా ఉన్నట్లయితే ఐస్ ముక్కను ఆ ప్రాంతంలో పెట్టి మర్ధన మాదిరిగా చేస్తే ప్రయోజనం ఉంటుంది. అల్లంలో నొప్పి, వాపు తగ్గించే లక్షణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులకు అల్లం నూనెను కూడా ఉపయోగించవచ్చు. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా ఆ నూనెతో మసాజ్ చేయవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. కీళ్ల నొప్పులకు అల్లం నూనె చాలా మేలు చేస్తుంది. ఇది ప్రభావిత ప్రాంతంలో నొప్పిని తగ్గిస్తుంది.

దీర్ఘకాలిక గాయాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి పసుపు అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే కర్కుమిన్ మూలకం కీళ్ల వాపును తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ పసుపులో అర టీస్పూన్ అల్లం కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పు నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టండి. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు కీళ్లపై రాయండి. ఇది కీళ్ల నొప్పులు, వాపును తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

అల్లం, పసుపును ఒక గ్లాసు నీటిలో 12-15 నిమిషాలు మరగబెట్టి.. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని తాగే మంచి ఫలితం ఉంటుంది. దీర్ఘకాలిక గాయాలు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి నిమ్మకాయ, ఉసిరి, బొప్పాయిని కూడా ఉపయోగించవచ్చు. వీటన్నింటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కీళ్ల నొప్పుల నివారణకు బ్రొకోలీ కూడా అద్భుతంగా పని చేస్తుంది. పిండితో చేసిన వస్తువులను తినడం తగ్గించాలి.

అలాగే, చక్కెర, స్వీట్లు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. రాతి ఉప్పులో మెగ్నీషియం, సల్ఫేట్ ఉన్నాయి. ఈ రెండూ శక్తివంతమైన నొప్పి నివారణ ఏజెంట్లు. ఇది వాపును తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. మీరు స్నానం చేసే నీటిలో ఒక టీస్పూన్ రాక్ సాల్ట్‌ను కలిపవచ్చు. నొప్పి, వాపు ప్రాంతాల్లో ఆ నీటిని పోస్తే ఫలితం ఉంటుంది. ఈ నేచురల్ హోం రెమెడీస్ మాత్రమే కాకుండా, వ్యాయామం కూడా వీటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి చాలా కాలం పాటు అలాగే ఉన్నట్లయితే.. వైద్యుడిని సంప్రదించాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker