Health

రోజు ఈ చిన్న పని చేస్తే చాలు, పొట్ట చుట్టు ఉండే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

పొత్తికడుపు చుట్టు ఉండే కొవ్వు ప్రాణాంతక జీవనశైలి వ్యాధులను అభివృద్ధి చేస్తుంది. ఈ కొవ్వు పొత్తికడుపు చుట్టూ పేరుకుపోతుంది. దీనిని కరిగించేందుకు తప్పక ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు. లేకుంటే ప్రమాదాలు తప్పవంటున్నారు. అయితే ఎక్కువ సేపు కూర్చొని పనిచేసేవారికి.. నడుం చుట్టూ రింగులా కొవ్వు ఏర్పడుతుంది. ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు.

చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు. కానీ దీని ద్వారా పొట్ట పెరుగుతుంది. ఆ తర్వాత బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్, మతిమరపు వంటి వ్యాధులు వచ్చేందుకు ఇది కారణం అవుతుంది. ప్రతీకాత్మక చిత్రంవిసెరల్ ఫ్యాట్‌గా పిలిచే ఈ కొవ్వు ఏ మాత్రం ఉంది అనేది తెలియాలంటే.. ఖరీదైన స్కానింగ్ అవసరం. సాధారణంగా మన శరీరానికి కొవ్వు అవసరం. కానీ నడుం దగ్గరి రింగు కొవ్వుతో మనకు ఉపయోగం ఉండదు. పైగా ప్రమాదకరం కూడా.

బాడీలో కొలెస్ట్రాల్ పెరిగేందుకు ఈ రింగు కొవ్వు కారణంగా మారగలదు. అసలు నడుం సైజ్ ఎంత ఉండాలి అనేది మనకు తెలియాల్సిన ప్రశ్న. మీ బొడ్డు పై నుంచి టేపుని పోనిస్తూ.. మీ నడుం సైజ్ ఎంత ఉందో మీకు మీరే కొలుచుకోవచ్చు. ఇలా కొలిచేసమయంలో పొట్టను వెనక్కి పంపుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా కొలవాలి. మహిళల్లో 35 అంగుళాల కు మించి ఉంటే.. రింగు కొవ్వు ఉన్నట్టే. మగవాళ్లలో 40 అంగుళాలకు మించి ఉంటే.. రింగు కొవ్వు ఉన్నట్లే.

బాడీ మాస్ ఇండెక్స్ కూడా మీకు కొవ్వు ఎంత ఉందో చెప్పగలదు. రింగు కొవ్వు పోవాలంటే.. ఇందుకోసం ఏదేదో చెయ్యాల్సిన పనిలేదు. మీకు వీలైన వ్యాయామాలు చెయ్యాలి. నడవాలి. ఇంట్లో వీలైనన్ని ఎక్కువ పనులు మీకు మీరే చేసుకోవాలి. మీ నడుం బాగా వంగేలా చేసుకోవాలి. స్ప్రింగులా ఎలా కావాలంటే అలా అది వంగగాలగాలి.

మీరు బరువు తగ్గుతూ ఉంటే.. రింగు కొవ్వు కూడా కరిగిపోతుంది. భోజనం చేశాక నడవండి. మెట్లు ఎక్కి, దిగండి. రోజూ కనీసం అరగంట ఎక్సర్‌సైజ్ కోసం కేటాయించండి. నెల రోజుల్లో మార్పును మీరే చూస్తారు. బరువు తగ్గుతూనే ఫిట్‌నెస్ పెంచుకోవాలి. బాడీని రాడ్డులా మార్చుకోవాలి. ఇందుకోసం పుషప్స్, సిటప్స్, యోగా వంటివి చెయ్యండి. కొత్త సంవత్సరం రిజల్యూషన్స్‌లో మీరు ఇది పెట్టుకొని ఉంటే.. మీ ఐడియా అదుర్స్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker