Health

చికెన్‌ ఇలా కడిగి వండుతున్నారా..! ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

చికెన్‌ను సరిగ్గా శుభ్రం చేయకపోతే ప్రమాదం కదా.. క్లీన్ చేస్తే ప్రమాదం ఏమిటనే ప్రశ్న తలెత్తవచ్చు. మొదటగా ఎవరైనా చికెన్ లేదా ఇతర నాన్ వెజ్ పదార్థాలు ఏవైనా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కావల్సిన విధంగా వండుకుంటారు. కాని చికెన్ విషయంలో ఇలా శుభ్రం చేసి వండుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అయితే సాధారణంగా మనం చికెన్ షాప్‌ నుంచి చికెన్ తీసుకొచ్చిన వెంటనే.. దానిని శుభ్రం చేస్తాం.

గిన్నెలో చికెన్ ముక్కలు వేసి.. దానిని ట్యాప్‌ కింద పెట్టి.. కడుగుతాం. కానీ ఇలా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వండాటానికి ముందుకు చికెన్‌ను నీటి ధార కింద కడగవద్దని.. లేదంటే అనేక రోగాలు వస్తాయని చెబుతున్నారు. చికెన్‌ను ట్యాప్ వంటి నీటి ధార కింద పెట్టి కడగడం వల్ల.. ఆ తుంపర్లు వంట గది అంతా చిమ్ముతాయి. వాటి ద్వారా కాంపైలోబాక్టర్, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీటి వల్ల అనేక వ్యాధులు వస్తాయని.. అందువల్ల చికెన్‌ను నీటి ధార కింద కడవద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నిపుణులు ఈ విషయంపై ప్రజలను హెచ్చరించారు. ఐనప్పటికీ చాలా మంది మానుకోవడం లేదు. ట్యాప్ కిందే కడుగుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా ఫుడ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ జరిపిన సర్వేలోనూ ఇది మరోసారి రుజువయింది. ఆస్ట్రేలియాలో చాలా మంది నీటి ధార కింద చికెన్‌ను కడిగి.. వ్యాధుల బారినపడ్డారట.

ఆస్ట్రేలియాలో సగం మందికి పైగా జనాభా కోడి మాంసాన్ని నీటి ధార కింద కడుగుతున్నారు. దీని వల్ల గడిచిన 20 ఏళ్లలో ఆస్ట్రేలియాలో కాంపైలోబాక్టర్, సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్లు రెట్టింపు అయ్యాయని తెలిపారు. అందువల్ల ఈ అలవాటను మానుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజుల్లో అత్యాధునిక మార్గాల్లో చికెన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అందువల్ల దానిని మళ్లీ ప్రత్యేకంగా కడగాల్సిన అవసరం లేదు.

ఒకవేళ మీకు కడగాలని అనిపిస్తే.. నీటి ధార కింద కాకుండా.. ఓ గిన్నెలో నీళ్లు పోసుకొని.. అందులో ముక్కలు వేసి.. శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతం శుభ్రమైన పొడి వస్త్రంతో తుడిచి… ఆ తర్వాత వండుకోవాలి. కొందరు చికెన్‌లో వెనిగర్, నిమ్మరసం వంటివి వేసి శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశముందని తెలిపారు. అందువల్ల చికెన్ కడిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker