ఎన్నో పోషకాలకు నిలయం ఈ కాయలు, మధుమేహం ఉన్నవారు ఒకసారి తింటే చాలు.
ఇక పండ్లలలో అద్భుతమైన పోషకాలు కలిగిన వాటిలో బ్లూబెర్రీస్ ఒకటి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. సహాజమైన చక్కెరలను కలిగి ఉంటాయి. అలాగే జ్ఞాపక శక్తిని పెంపొదిస్తాయి. అయితే బ్లూబెర్రీస్‌లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీస్తాయి. దాంతో క్యాన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్లూబెర్రీస్ DNA డ్యామేజ్‌ను తగ్గిస్తాయి.
DNA నష్టం రోజువారీ జీవితంలో ఒక అనివార్యమైన భాగం. బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున, అవి మీ DNA ను దెబ్బతీసే కొన్ని ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి. బ్లూబెర్రీస్ తినడం వల్ల “చెడు” LDL కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది. ఊబకాయం ఉన్నవారికి అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోజుకు 2 ఔన్సుల (50 గ్రాములు) బ్లూబెర్రీస్ తీసుకున్న తర్వాత రక్తపోటులో 4-6% తగ్గుదలని గుర్తించారు.
బ్లూబెర్రీస్ వంటి ఆంథోసైనిన్స్ అధికంగా ఉండే పండ్లను తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. బ్లూబెర్రీస్ మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఒత్తిడితో కూడిన జీవనశైలి మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బ్లూబెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు మెదడులోని మేధస్సుకు అవసరమైన ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి.
బ్లూబెర్రీస్‌లోని ఆంథోసైనిన్లు మధుమేహ రోగులకు ప్రయోజనకారి. బ్లూబెర్రీస్ యాంటీ-డయాబెటిస్ ప్రభావాలను కలిగి ఉన్నాయని, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTIs) అనేది మహిళలకు వచ్చే అతి సాధారణ సమస్య. ఇది UTIలను నిరోధించడంలో సహాయపడుతుంది. 9. బ్లూబెర్రీ కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.