Health

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఒక్క దోమ ఉండదు.

ఇంట్లోకి దోమలు రావటం వలన డెంగ్యూ, మలేరియా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి లేదంటే డెంగ్యూ, మలేరియా ప్రాణాంతకమయ్యే అవకాశం లేకపోలేదు.. దోమలను నివారించడం కోసం వివిధ రకాల మస్కిటో కాయిల్స్, లోషన్స్ ఉపయోగిస్తారు.. అయితే ప్రస్తుతం అనేక వ్యాధులకు దోమలు మూలకారణమౌతున్నాయి. దోమల వల్ల వచ్చే వ్యాధులతో మరణిస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది.

దోమల కారణంగా మలేరియా, డెంగు, మెదడువాపు, చికెన్ గున్యా, పైలేరియా వంటి వ్యాధులు వస్తాయి. అయితే చాలా మంది దోమల బారిన పడకుండా అనేక పద్దతులను అనుసరిస్తుంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు దొమలు రాకుండా నివారించటంలో తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. దోమలు దరిచేరకుండా చేసే మొక్కలు: బంతి.. బంతి పూలతో మీ ఇంటి ఆవరణకు నిండుదనం రావటంతోపాటు దీనిలో ఉండే పైరేత్రం అనే పదార్ధం కీటక నివారిణిగా పనిచేస్తుంది.

కుండీల్లో , తోటల్లో మీకు నచ్చిన విధంగా ఈ మొక్కలను పెంచుకోవచ్చు. సిట్రనెల్లా.. ఘాటైన సువాసన కలిగిన ఈ మొక్క దోమల నివారిణిగా చెప్పవచ్చు. ఐదు నుండి ఆరు అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. ఈ మొక్కను పెంచు కోవటం ద్వారా ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవచ్చు. లెమన్ బామ్.. పుదీనా కుటుంబానికి చెందిన లెమన్ బామ్ మొక్క హార్స్ మింట్ గా ప్రసిద్ధిగాంచింది., దీని సువాసనకు దోమలను తరిమికొట్టే శక్తి ఉంది.

ఆకులను ఎండబెట్టి టీ పొడిగా చేసుకుని తాగవచ్చు. ఈ చెట్టును ఇంటి పెరట్లో పెంచుకోవటం వల్ల దోమలు రాకుండా చూసుకోవచ్చు. జెరానియం.. కుండీల్లో సులభంగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. దీనికి ఉండే నిమ్మ సువాసనకు దోమలు అసహనంగా ఫీలవుతాయి. దీనిని ఇంటి ముంగిట్లో కుండీల్లో లేదంటే విడిగా పెంచుకోవటం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు.

మాచిపత్రి.. అస్టరేసి కుటుంబానికి చెందిన మాచిపత్రిని చాలా చోట్ల దవణంగా పిలుస్తారు. ఈ మొక్క వెదజల్లే సువాసనకు దోమలు ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అలాగే నిమ్మ నూనె, యూకలిప్టస్ నూనె కలిపి ఇంటి కిటికీలకు దోమలు ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశాల్లో స్ప్రే చేయటం ద్వారా ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో వేసి కషాయంలా చేయాలి. కాస్త నిమ్మగడ్డి నూనె కలిపి ఇంట్లో స్ప్రే చేసుకోవాలి. ఇలా చేస్తే దోమలు దరిచేరవు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker