చలికాలంలో గుండె పోటు మరణాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకో తెలుసా ..?
చలి కారణంగా గుండె ధమనులలో సంకోచం కారణంగా ఇది జరుగుతుంది. ఈ సీజన్‌లో తెల్లవారుజామున ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాలలో, గుండెపోటు ఉదయం 4 నుంచి 7 గంటల మధ్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో, దానిని నివారించడం చాలా ముఖ్యం. వేసవిలో కంటే శీతాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో గుండె ధమనులు కుచించుకుపోతాయి. అయితే రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
అదే సమయంలో తెల్లవారు ఝామున పొగమంచు, చల్లనిగాలులు అధికమయ్యాయి. ఎక్కువగా గుండెజబ్బులతో బాధపడేవారు, అధిక రక్తపోటు, మధుమేహంతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నవారు చలికాలం తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కలోనరీ కూడా దగ్గరవడంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడేవారికి ఇది ఒకరకంగా గడ్డుకాలమేనని చెప్పవచ్చు.
ముక్కులు బిగిసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువవుతాయి. అలర్జీ సమస్యలు ఈ సమయంలో పీడిస్తుంటాయి. అదే సమయంలో వాకింగ్ , జాగింగ్ చేయడాని బయట తిరిగినా సరే గుండెపోటు వచ్చే ప్రమాదముందని వైద్యులంటున్నారు. అసలు ఉదయం పూట వాకింగ్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. చలికాలంలో శరీరంలోని రక్తనాళాలన్నీ దగ్గరవుతాయి. చలి కాలంలో శరీర ఉష్ణోగ్రత ను ఒకే స్ధాయిలో ఉంచుకోవటం కష్టం కారణంగా, హైపోథెర్మియా ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
ఫలితంగా గుండె యొక్క రక్త నాళాలకు నష్టం కలుగుతుంది. ఇప్పటికే హార్ట్ ఎటాక్స్ ఉన్న వారికీ ఈ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. చలి కాలంలో శరీరానికి ఆక్సిజెన్ లెవెల్స్ కూడా ఎక్కువవుతాయి. గుండెకి కావాల్సినంత ఆక్సిజెన్ అందక హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ ఎక్కువవుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఈ కాలంలో ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒత్తిడి కూడా మరో కారణంగా చెప్పవచ్చు. చలి కాలం లో శరీరానికి అనువుగా ఉండే బట్టలు ధరించాలి. వెచ్చదనాన్నిచే బట్టలు, స్వెటర్స్, షాల్స్ వంటివి తప్పని సరిగా ధరించాలి. చెవులలోకి చల్లని గాలి వెళ్లకుండా చూసుకోవాలి.
ఇంట్లోనే వ్యాయామాలు చేయటం మంచిది. బయటకు వెళ్లటం అంత శ్రేయస్కరం కాదు. రక్తపోటు, మధుమేహాలను నియంత్రణలో ఉంచుకోవటం మేలు. ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ వంటివి కంట్రోల్ లో ఉంచుకోవాలి. చివరగా ఛాతీలో బరువుగా ఉండడం, చెమట, భుజం నొప్పి, దవడ నొప్పి, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడం, వికారంగా వాంతి అయ్యేట్లుగా ఉండడం వంటి వాటిని తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సకాలంలో వైద్య చికిత్స పొందితే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు.