Health

ఈ బెండకాయలు కిలో రూ.800, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఎర్ర బెండకాయలు..ఫైబర్‌ పుష్కలం. మలబద్ధకం లాంటి సమస్యలు రానేరావు. యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలూ అనేకం. కొలెస్ట్రాల్‌కూడా నియంత్రణలో ఉంటుంది. మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందంటున్నారు. అందుకే, ‘బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని అంటున్నారు నిపుణులు. ‘పచ్చబెండకు చిట్టి తమ్ముడు అయిన ఎర్రబెండ ఆరోగ్యానికి మరింత మంచిదనీ’ అంటున్నారు.

అయితే పచ్చ బెండకాయలతో పోలిస్తే ఎర్ర బెండకాయలో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కనుక వాటి ధర కూడా సాధారణ బెండకాయతో పోలిస్తే ఆరు నుంచి ఏడు రెట్లు అధికంగా పలుకుతుంది. అందుకే ఎర్ర బెండకాయల సాగుని చేపట్టినట్టు చెబుతున్నాడు రాజ్ పుత్. ముందుగా తాను ఎర్ర బెండకాయల్ని పండించాలని నిర్ణయించుకున్నాక వారణాసిలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి కిలో విత్తనాలు కొని తెచ్చుకున్నట్టు చెప్పాడు.

వాటిని ఈ ఏడాది జులై మొదటి వారంలో పొలంలో చల్లాడు. నలభై రోజులకు బెండకాయలు కాయడం మొదలైనట్టు చెప్పాడు. తాను ఎలాంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు చల్లకుండా సేంద్రీయ ఎరువులతోనే సాగు చేస్తున్నాడు రాజ్ పుత్. ఎకరాకు ఈ ఎర్ర బెండకాయలు కనిష్టంగా 40 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 80 క్వింటాళ్ల వరకు పంట చేతికొస్తుంది. వీటిని సూపర్ మార్కెట్లలో అర కిలో ప్యాకెట్లుగా కట్టి మూడు వందల నుంచి నాలుగువందల రూపాయల వరకు అమ్ముతున్నాడు రాజ్ పుత్.

ఈ పంటనే భవిష్యత్తులో విస్తరించాలనుకుంటున్నట్టు చెబుతున్నాడు ఈ ఆధునిక రైతు. ఆకుపచ్చ బెండకాయతో పోలిస్తే ఎరుపు బెండకాయలో పోషకాల విలువ ఎక్కువ. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, రక్త పోటు, కొవ్వు సమస్యలతో బాధపడేవారికి ఈ బెండకాయ ఎంతో మేలు చేస్తుంది. ఆ ఆరోగ్య సమస్యలు ఉన్నా వాళ్లు ఈ బెండ కాయ ఎంత తిన్నా మంచిదే. అందునా సేంద్రియ పద్దతిలో పండినది కావడంతో ఎక్కువ మంది వినియోగదారులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker