Health

ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఆరోగ్యానికి చాలా డేంజర్.

కొన్నిస్లారు కొలతకు మించి వంట చేస్తుంటారు. ఇలా చేసిన సమయంలో వండిన ఆహారం అలాగే మిగిలిపోతుంది. ఆ మిగిలిన ఆహారంను మళ్లీ వేడి చేస్తాం. ఆహారం వృధా కాకుండా ఇలా వేడి చేసి తిరిగి తినేస్తుంటాం. కానీ ఇలా మళ్లీ వేడి చేసి తినడం ద్వారా మీరు మీ ఆరోగ్యానికి మేలు చేయడం కాకుండా హాని చేస్తున్నారని మాత్రం మరిచిపోకండి. అయితే నిజానికి ఒకసారి వేడి చేసిన వాటిని మళ్లీ వేడి చేసుకుని తినడం వల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. దీంతో అందులో హానికారక బ్యాక్టీరియా పెరుగుతుంది.

అలా చేస్తే ఆహారం విషతుల్యంగా అవుతుంది. కొందరైతే మైక్రో వేవ్ లో పెట్టి మరీ తింటుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేస్తే కడుపులో గ్యాస్, కలత, ఫుడ్ పాయిజనింగ్, ఆహారం ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు దరిచేరడం ఖాయం. ఒకసారి వండిన ఆహారాన్ని వేడి చేసుకుని తినడం కంటే దాన్ని పడేయడం ఉత్తమం. మనకు పోషకాలు అందించే ఆహారాల్లో కోడి గుడ్డు ఒకటి. ఇందులో ఉండే ప్రొటీన్లతో మనకు ఎంతో లాభం ఉందని గుర్తించి వాటిని పొద్దున తిన్నాక మిగిలితే సాయంత్రం ఓవెన్ లో పెట్టుకుని వేడి చేసుకుని మరీ తినడం చేస్తుంటారు.

గుడ్లను మళ్లీ వేడి చేయడం అంత సురక్షితం కాదు. ఇలా చేయడం వల్ల అందులో ఉండే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా పెరిగి మనకు విషంగా మారే ప్రమాదం పొంచి ఉంది. అందుకే వేడి చేయకుండా అలాగే తినడం సురక్షితం. మళ్లీ వేడి చేయడం వల్ల కలిగే అనర్థాలను గుర్తుంచుకుని వేడి చేయడాన్ని మానుకోవడమే మంచిది. అత్యధిక కార్బోహైడ్రేడ్లు ఉన్న ఆహారాల్లో బంగాళాదుంప ఒకటి. దీన్ని మితంగా తింటేనే ప్రయోజనం. అధికంగా తీసుకుంటే నష్టమే. బంగాళాదుంప కూరను కూడా మరోమారు వేడి చేయడం వల్ల అందులో ఉండే సి బోటులినమ్ బాగా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారి తీస్తుంది.

మనలో చాలా మంది రాత్రి మిగిలిపోయిన చికెన్ ను పొద్దున వేడి చేసుకుని తింటారు. ఇది కూడా డేంజరే. వేడి చేయడం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. దీంతో చికెన్ లో ఉండే ప్రొటీన్లు విషంగా మారుతాయని పరిశోధనలు వెల్లడించాయి. అందుకే ఉదయం వండిన వాటిని మళ్లీ వేడి చేయడం వల్ల మనకు ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి. అన్నాన్ని సాక్షాత్తు అన్నపూర్ణ దేవితో పోలుస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు. అన్నాన్నికూడా వేడి చేసుకుని తింటారు. ఇది కూడా కరెక్టు కాదు. అన్నాన్ని వేడి చేసి తినకూడదు. దీంతో వ్యాధికారక బ్యాక్టీరియా ఎక్కువై మనకు రోగాలు వస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker