Health

జీడిపప్పు తింటే నిజంగానే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?

జీడిపప్పులో లభించే పోషకాలు జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, రాగి, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని పోషకాల నిధి అని పిలుస్తారు. జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి కాళ్ల నొప్పులు దూరమవుతాయి. కొలెస్ట్రాల్ లేని కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారంగా చెబుతారు. జీడిపప్పును తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే.

జీడిపప్పును సరైన మోతాదులో తింటే బరువు పెరిగే అవకాశం ఉండదు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే జీడిపప్పు మనకు మేలు చేస్తుందని చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీడిపప్పులో కొవ్వును తగ్గించడానికి సహాయపడే కొవ్వులు పుష్కలంగా ఉండటంతో గుండెకు బలం కలుగుతుంది. జీడిపప్పును తక్కువ మొత్తంలోనే తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. జీడిపప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మనం తినే ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

కూరల్లోనే కాకుండా వివిధ వంటల్లో దీన్ని చేర్చుకోవడం ఉత్తమం. జీడిపప్పులో ఒమేగా 3 అల్ఫా లినోలెనిక్ ఆమ్లం ఉండటం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు ఉండటంతో జీవక్రియ మెరుగుపడుతుంది. జీడిపప్పులో ఉండే బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి మేలు కలిగిస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. జీడిపప్పులో అధిక సాంద్రత కలిగించే లుటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కళ్లకు రక్షణ కలిగిస్తాయి. జియాక్సంతిన్ యాంటీ ఆక్సిడెంట్లు మేలు చేస్తాయి.

అతినీలలోహిత కిరణాల ఫిల్టర్ గా ఇవి పనిచేస్తాయి. జీడిపప్పు తినడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ఇందులో ఉండే స్టెరిక్ ఆమ్లం వల్ల మన రక్తంలో కొవ్వు స్థాయిలను అదుపు చేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోతే గుండె జబ్బులు వస్తాయి. జీడిపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో మెగ్నిషియం ఉండటం వల్ల గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా చేస్తుంది. జీడిపప్పులు మధుమేహులకు లాభం కలిగిస్తుంది. దీనిలో కార్బోహైడ్రేడ్లు తక్కువగా ఉంటాయి. జీడిపప్పులను మోతాదులో తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker