కొబ్బరి బెల్లం కలిపి తింటే ఈ దారుణ వ్యాధులు రమ్మన్నా రావు.
కొబ్బరి,బెల్లంలో మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే మన పూర్వీకులు మనకు చూపించిన మార్గాల్లో వారు సూచించినవి తీసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు రానే రావు. ఈ నేపథ్యంలో కొబ్బరి, బెల్లం గురించి తెలుసుకుందాం. కొబ్బరిలో మంచి ప్రొటీన్లు, విటమిన్లు దాగి ఉన్నాయి. అందుకే కేరళ వారు వంటల్లో కొబ్బరిని బాగా వాడటం వల్ల వారు తెలివిలో చురుకుగా ఉంటారు.
అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లో కేరళ ముందుంటుంది. కొబ్బరితో మనకు ఎన్నో లాభాలున్నాయి. దీంతో వారికి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. కొబ్బరి బల్లం కలిపి తీసుకుంటే పలు ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసినా మనం కొబ్బరిని తినడానికి ఇష్టపడం. ఒక్క కొబ్బరిబొండాం తాగితే ఒక గ్లూకోజ్ ఎక్కించుకున్న బలం చేకూరుతుంది. కొబ్బరి బెల్లంలో కార్బోహైడ్రేడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకుంటే శక్తి కలుగుతుంది. కీళ్లనొప్పులు దూరం చేస్తుంది. గర్భిణులు తీసుకుంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తగ్గుతాయి.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇతర రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. గోరు వెచ్చని నీటిలో బెల్లం వేసుకుని తాగితే శ్వాస సంబంధిత రోగాలు రాకుండా పోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పొటాషియంతో బరువు తగ్గడానికి కారణమవుతుంది. శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువగా నీరు లేకుండా చేస్తుంది. కొబ్బరి బెల్లం క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి. చాలా మంది కొబ్బరి తింటే దగ్గు వస్తుందని అపోహ పడుతుంటారు.
అందులో నిజం లేదు. కొబ్బరి తింటే బలమే కానీ ఇతర ఏ రకమైన ఇబ్బందులు రావు. కొబ్బరి ఉండలు తింటే ఎన్నో రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి బెల్లంలో ఉండే ప్రొటీన్లతో మన శరీరానికి ఎన్నో విధాల ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకు తరచుగా కొబ్బరి ఉండలు ఇస్తుంటే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా తెలివితేటల్లో మంచి చురుకుగా తయారవుతారు. చదువులో ముందంజలో నిలుస్తారు. ఇన్ని లాభాలున్న కొబ్బరిని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల మనకు దీర్ఘకాల వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.