ఈ రోజుల్లో ఎక్కువ మందిని వెంటాడే సమస్యకు శాశ్వత పరిష్కారం ఈ ఉల్లికాడలు.
ఉల్లిపాయలే కాదు.. వాటి మొలకల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటినే ఉల్లికాడలు అంటారు. వీటిని ఇంగ్లిషులో స్ప్రింగ్ ఆనియన్స్ అని అంటారు. ఉల్లిపాయల్ని వాడలేని వాళ్లకి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. ఉల్లికాడలను రసం ఒక టీ స్పూన్, ఒక టీ స్పూన్ తేనే కలిపి రోజూ తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే వీటిని ఆహారపదార్థాల్లో ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని వారు చెబుతున్నారు.
అనేక ఆరోగ్య సమస్యలకు ఉల్లికాడలు ఓ దివ్య ఔషధంగా పనిచేస్తాయట. కూరల్లో వాటిని వేసుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుండె, రక్తనాళాలకు ఉల్లికాడలు బాగా ఉపయోగపడతాయి. ఇవి కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తాయి. దీనిలో పుష్కలంగా ఉండే సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
ఉల్లికాడల్లో ఉండే పెక్టిన్ ముఖ్యంగా పెద్ద పేగు కాన్సర్ వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇవి కీళ్ళ నొప్పులు, ఉబ్బసం చికిత్సకు బాగా ఉపయోగపడతాయి. ఉల్లికాడల్లో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహం నుంచి కాపాడుతుంది.ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు దీనిలోని స్థూలపోషకాలు జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి.
కళ్ళ జబ్బులు, కాళ్ళ సమస్యలు ఉన్నవాళ్లు ఉల్లికాడలు తినడం మంచిది. దీనిలో ఉండే అల్లసిన్ చర్మానికి మంచి చేస్తుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. శరీరంలో గ్లూకోజ్ శక్తిని పెంచుతుంది. దీనిలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సహకరిస్తుంది. అజీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి అవసరమైన యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలనూ అందిస్తాయి. ఇది బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తుంది.