Health

మీ శరీరంలో కొవ్వు గడ్డలు,కంతులను పూర్తిగా కరిగించే కరిగించే సింపుల్ చిట్కా.

కొవ్వు గ‌డ్డ‌లు మ‌న శ‌రీరంలో ఎక్క‌డైనా రావ‌చ్చు. ఇవి ఎక్కువ‌గా చేతులు, కాళ్లు, పొట్ట‌, భుజాలు వంటి భాగాల్లో ఎక్కువ‌గా వ‌స్తాయి. ఈ గ‌డ్డ‌లు మ‌న‌కు ఎటువంటి నొప్పిని, హానిని క‌లిగించ‌వు. చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే వీటి వ‌ల్ల మ‌న‌కు హాని క‌లుగుతుంది. అయితే మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు ఒక చోటకు చేరి గడ్డలుగా తయారవుతుంది.. ఈ కొవ్వు గడ్డలు శరీరంలో అక్కడక్కడా వస్తూ ఉంటాయి.

వీటి వలన నొప్పి, బాధ ఏమి ఉండవు.. ఇవి ఏర్పడిన ప్రవేశంలో నరాలమీద ఒత్తిడిని కలిగించి ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కలబంద ఉంటుంది. కలబంద మట్టలు తీసుకుని నిప్పుల కుంపటి లో వేయాలి. కలబంద లోపలి గుజ్జు మగ్గిన తరువాత ఆ గుజ్జు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొవ్వు గడ్డలు పై పెట్టి ఉంచాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే త్వరగా కొవ్వు గడ్డలు కంతులు కరిగిపోతాయి. ఉత్తరేణి ఆకు కొవ్వు గడ్డలు కరిగించే దానికి అద్భుతంగా సహాయపడుతాయి.

ఉత్తరేణి ఆకులను ముద్దగా నూరి కొవ్వు గడ్డలు కంతులు ఉన్నచోట ఆ ముద్దను ఉంచి రాత్రిపూట కట్టు కట్టి ఉదయం వరకు అలాగే ఉంచాలి. ఇలా వరుసగా వారం రోజులు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. మునగాకు టీ ని తయారు చేసుకుని ప్రతి రోజూ తాగుతూ ఉంటే కొవ్వు గడ్డలు త్వరగా కరిగిపోతాయి. కొవ్వు గడ్డలు ఉన్నవారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల తాటి బెల్లం వేసి బాగా మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగాలి. ఇలా ప్రతి రోజూ తాగటం వలన శరీరంలో ఉన్న కొవ్వు గడ్డలు త్వరగా కరిగిపోతాయి.

కలబంద గుజ్జు లో ఒక వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు వేసి దంచి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొవ్వు గడ్డలు ఉన్న చోట రాయాలి. ఇలా చేసినా కూడా కొవ్వు గడ్డలు త్వరగా కరిగిపోతాయి. కొవ్వు గడ్డలు మనం ఆహారం ద్వారా ఏర్పడతాయి. అందుకని మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కొవ్వు గడ్డలు ఉన్నవారు ఫ్యాట్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమం. లేకపోతే శరీరంలో కొవ్వు పెరిగిపోయి గడ్డలు పెరిగే ప్రమాదం లేకపోలేదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker