ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కడుపులో క్యాన్సర్ వస్తుందా..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ఉప్పుని ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికే ముప్పేనట. ఉప్పు కనుక మోతాదు కనుక మించితే గుండె జబ్బులు, స్ట్రోక్స్ పెరుగుతాయని WHO తెలిపింది. అయితే జీవనశైలి , ఆహారపు అలవాట్లలో మార్పులే ప్రధానంగా కడుపు సంబంధిత క్యాన్సర్లకు ముఖ్యకారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది ఒక ముఖ్యమైన ప్రజారోగ్య భారంగా మారుతుంది.
కడుపు క్యాన్సర్ ఉప్పు మరియు నైట్రేట్లు జోడించబడిన ఆహారాలే కారణంగా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆహార కారకాలు కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయని సూచిస్తున్నాయి. ఉప్పు తీసుకోవడం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మరణాలతో దగ్గరి సంబంధం కలిగి ఉందని పర్యావరణ అధ్యయనాలు సూచిస్తున్నాయి. కడుపు క్యాన్సర్ ను తొలనాళ్లలో గుర్తించటం కష్టమౌతుంది. ఆకస్మికంగా బరువు తగ్గడం, కడుపునొప్పి, ఆకలిని కోల్పోవడం, కడుపుబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు, రక్తం వాంతులు, ఇలాంటివి క్యాన్సర్ తీవ్రత పెరిగినసందర్భంలో కనిపిస్తాయి.
ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం చెడు ఆహార అలవాట్లు ఒకటైతే అధిక కారం, ఉప్పు వినియోగం కూడా సమస్యకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు మరియు సాల్టెడ్ ఆహార వినియోగంపై పరిమితి గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను నిరోధించడానికి ఒక ఆచరణాత్మక వ్యూహంగా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉప్పు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, మాంసాహారం అధికంగా తినేవారిలో కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వంశపారపర్యంగా స్మోకింగ్, ఊబకాయం అలవాట్లు , రకరకాల ఇన్ఫెక్షన్లు మూలంగా కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
కడుపు క్యాన్సర్ రాకుండా.. ఆకుపచ్చ కూరగాయలు, రంగురంగుల పండ్లు తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ ప్రమాదం తగ్గిపోతుంది. తృణధాన్యాల , ముడి బియ్యం లాంటివి డైట్లో చేర్చుకోవాలి. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. అలాగే స్పైసీ ఫుడ్ మాంసం, చేపలు తక్కువగా తీసుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే వాటిని మానేయాలి. తరచుగా కడుపునొప్పి, కడుపుబ్బరం అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి కారణాలు తెలుసుకోవటం మంచిది. అవసరమనుకుంటే వైద్యులు చికిత్సను అందించేందుకు అవకాశం ఉంటుంది.