చలికాలంలో రోజుకు ఒక కప్పు ఈ టీ తాగితే ఎలాంటి రోగాలు రావు.
శరీరంలో అధిక కొలెస్ట్రాల్, ఫ్రీ రాడికల్స్ మరియు ప్రధాన ధమనులలో రక్తం గడ్డకట్టే సమస్యల వల్ల గుండె జబ్బులు వస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల గుండె సమస్యలకు దివ్య ఔషధం. వెల్లుల్లిని గుండెకు టానిక్‌గా ఆయుర్వేదం వర్ణిస్తుంది. అయితే ఉల్లిలాగే వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో అనేక ఔషదగుణాలు ఉన్నాయి.
బరువు తగ్గించడం దగ్గర్నుంచి, రక్తహీనతను దూరం చేయడం వరకు వెల్లుల్లి మనకు అన్ని విధాలుగా సహాయకారిగా పనిచేస్తుంది. రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చు. వెల్లుల్లిలో అల్లిసిన్, డయల్ డైసల్ఫైడ్ మరియు డయల్ ట్రైసల్ఫైడ్ వంటి సల్ఫర్-కలిగిన సమ్మేళనాలు ఉన్నాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా మీకు సహాయపడుతుంది. గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి.. గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు.
శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా చలికాలంలో వచ్చే గొంతు సంబంధిత సమస్యలు మనల్ని బాధించవు. అందుకే గొంతు నొప్పితో బాధపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
రక్తహీనతతో బాధపడేవారికి సమస్యను అధిగమించేందుకు సరైన ఔషధం వెల్లుల్లిని చెప్పవచ్చు. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తహీనత నుంచి త్వరగా బయటపడచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ విడుదలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. దీంతో అనీమియా సమస్యకు చెక్ చెప్పవచ్చు. వెల్లుల్లితో ప్రతిరోజు టీ గా తయారు చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి అన్ని విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.