ఈ ఆకూ కూరని తరచూ తింటుంటే లైంగిక సామర్థ్యం భారీగా పెరుగుతుంది.
మెంతి ఆకుల్లో ఇనుము, అధికంగా వుంటుంది. గర్భిణీలు ఎంత తీసుకుంటే అంత మంచిది. శిశువు ఎదుగుదులలో ఇందులోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. బాలింతలు మెంతి కూర తినడం వల్ల పాల వృద్ధి బాగుంటుంది. అయితే ఆహారం రుచి పెంచాలన్నా, ఆరోగ్యం కోసమైనా కసూరి మెంతికూర ను ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా వాడుతుంటారు. కసూరి మెంతికూరలో కూడా తాజా మెంతికూర లాగానే పుష్కలమైన పోషకాలు కలిగి ఉంటుంది.
అయితే కసూరి మెంతిని నిల్వ ఉంచుకొని ఏ వంటకంలో అయినా వాడుకోవచ్చు. కసూరి మెంతికూరలో కాల్షియం, ఐరన్, విటమిన్-సి వంటి పోషకాలతో పాటు యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారినుంచి రక్షిస్తుంది. చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కసూరి మెంతికూరలో ఉండే హీలింగ్ ఎఫెక్ట్ శరీరం వాపు, నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఈ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది. స్త్రీలకు పనికొచ్చే ఔషధ గుణాలు అన్ని మెంతికూరలో ఉన్నాయి. ఆడవారిలో ఎక్కువగా కనిపించే బాధ నడుము నొప్పి. మెంతికూర తినడం వల్ల నడుము నొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది.
మెంతులలో కావలసినంత పీచు పదార్దాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి. మెంతి ఆకులను తినడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. షుగర్ వ్యాధిని కూడా అదుపులో ఉంచే గుణం మెంతికూరకు ఉంది.