కలబందను ఇలా చేసి జుట్టుకు అప్లై చేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?
కలబంద గుజ్జు జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీనిని ఉపయోగించి సులభమైన ఇంటి చిట్కాలతో తలకి ఉపయోగించవచ్చు దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు మరియు ప్రొటీలిటిక్ ఎంజైమ్‌ల మీ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మరియు జుట్టు పెరుగుదలను పెంచడానికి సమర్ధవంతంగా సహాయం చేస్తుంది. అయితే చలి కాలంలో చాలా మంది జుట్టు సమస్యల బారిన పడతారు. ముఖ్యంగా చాలా మందిలో జుట్టు రాలడం, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు.
అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు వాతావరణంలో తేమ పెరగడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే జుట్ట చలి కాలంలో కూడా పొడవుగా, మందపాటిగా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించి.. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కలబందను ఎలా ఉపయోగించాలి.. కలబందలో ఉండే పోషకాలు జుట్టును దృఢంగా ఉంచేందుకు సహాయపడతాయి. అలోవెరా జెల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది.
అంతేకాకుండా ఈ రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల కూడా జుట్టు దృఢంగా తయారవుతుంది. కలబంద ప్రయోజనాలు..కలబందను ఉపయోగించడం వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో కలబందను అప్లై చేయడం వల్ల జుట్టుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు బలంగా మారుతుంది.. కలబందలో ఉండే పోషకాలు జుట్టును బలంగా చేసేందుకు సహాయపడతాయి. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి12 వెంట్రుకలను వేర్లు నుంచి దృఢంగా మార్చుతాయి.
పొడవాటి జుట్టు..కలబంద జుట్టును అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జుట్టును దృఢంగా చేసి.. పొడవాటి జుట్టుకు దోహదపడుతుంది. ఆయిల్ ఫ్రీ జుట్టు.. కలబందలో ఉండే ఎంజైమ్‌లు జుట్టుకు లోపలి నుంచి పోషణను అందించేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా జుట్టు సిల్కీగా, మెరుస్తూ ఉంటుంది. కలబంద జుట్టు నుంచి అదనపు సెబమ్‌ను తొలగిస్తుంది. ఇది జుట్టును ఆయిల్ ఫ్రీగా చేస్తుంది.