ఈ నూనెతో శరీరాన్ని మసాజ్ చేస్తే ఆ సమస్యలన్ని తగ్గిపోతాయి.
బాడీ మసార్ వల్ల వంటినొప్పులు నివారించబడుతాయి మరియు ఒత్తిడి తగ్గిస్తుంది. మరియు ఇది మూడ్ ను ప్రశాంత పరుస్తుంది . శరీరంలో ఎండోర్ఫిన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్స్ విశ్రాంతి పొందడానికి మరియు పెయిన్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. అయితే పూజకు వినియోగించే నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా నువ్వుల నూనెను ఆహారాలను వండుకునే క్రమంలో వినియోగిస్తే శరీరానికి చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శరీరానికి నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నువ్వుల నూనెలో కొవ్వులు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. దీనిని వినియోగిస్తే చర్మం నుంచి గోళ్ల వరకు చాలా రకాలుగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నువ్వుల నూనెలో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం అధిక స్థాయిలో ఉంటాయి.
ఇది వృద్ధాప్య దశలో ఉన్నవారికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరానికి నల్ల నువ్వుల నూనెను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నల్ల నువ్వుల నూనెతో కండరాలకు మసాజ్ చేయడం వల్ల కండరాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. బరువు కూడా సులభంగా తగ్గుతారు.. నువ్వుల నూనెతో బాడీ మసాజ్ చేసుకోవడం వల్ల శరీరంలో వేడి తీవ్రత పెరిగి పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు.
కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా నల్ల నువ్వుల నువ్వుల నూనె వినియోగించి బాడీ మసాజ్ చేసుకోవలసి ఉంటుంది. జాయింట్ పెయిన్స్.. కీళ్ల వాపు, మోకాళ్ళ నొప్పుల సమస్యలు ప్రస్తుతం సర్వసాధారణమైపోయాయి. భారతదేశ వ్యాప్తంగా ఈ సమస్య బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ప్రొడక్షన్ వినియోగించకుండా.. కేవలం నువ్వుల నూనెతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నొప్పి తీవ్రత ఉన్నచోట ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.