మీ చేతి గోర్లపై ఈ మార్పులు వస్తే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.
కరోనా సమయంలో పదే, పదే చేతులు శుభ్రం చేసుకోమని ఆరోగ్య నిపుణులు సూచించారు. కాగా చేతులు కడిగినప్పటికీ.. గోర్లలో మలినాలు దాగుండే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు గోర్లను తొలగించుకోవాలి. కాగా ఇక్కడే ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తున్నారు నిపుణులు.. మీ గోళ్ల ఆకృతి, రంగు మీ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయట. మీ చేతి గోర్లు రంగు మారినా, మచ్చలు ఏర్పడినా.. చివరికి బొడిపెలు, గీతలు వంటివి ఏర్పడినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచింది.
అయితే ఇటీవలి కాలంలో అందరి జీవనశైలి పాడవుతోంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు బలవుతున్నారు. చెడు లైఫ్‌స్టైల్ కారణంగా కొలెస్ట్రాల్, గుండెపోటు ముప్పు పెరుగుతోంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్థూలకాయంతో పాటు అధిక రక్తపోటు సమస్య కూడా వేధిస్తుంటుంది. చాలామందికి శరీరంలో కొలెస్ట్రాల్ ఉందో లేదో త్వరగా తెలుసుకోకపోవడం వల్ల పరిస్థితి విషమిస్తుంటుంది.
అయితే శరీరంపై బాహ్యంగా కన్పించే కొన్ని లక్షణాలతో కొలెస్ట్రాల్‌ను సులభంగానే గుర్తించవచ్చు. కొలెస్ట్రాల్ ఉంటే గోర్లు, చేతుల్లో కన్పించే లక్షణాలు.. గోర్లు పసుపుగా మారడం.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గోర్ల రంగు పసుపుగా మారుతుంది. శరీరంలో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడాన్ని సూచిస్తుంది. ఫలితంగా గోర్ల రంగు మారుతుంది. పసుపు రంగులో కన్పిస్తాయి. లేదా గోర్లు బీటలువారుతాయి. గోర్ల పెరుగుదల కూడా నిలిచిపోతుంది.
చేతుల్లో నొప్పి.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే కొద్దీ..చేతుల్లోని రక్త నాళికలను క్లోజ్ చేస్తుంది. ఫలితంగా చేతులు నొప్పి వస్తుంటాయి. అందుకే తరచూ చేతుల నొప్పి సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. చేతులు తిమ్మిరెక్కడం.. శరీరంలోని కొన్ని భాగాలకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడటంతో చేతులు తిమ్మిరెక్కుతుంటాయి. స్థూలకాయం, హై కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా చేతులు తిమ్మిరెక్కుతుంటాయి.