Health

హార్ట్ పేషెంట్స్‌ వీటిని అస్సలు తినకూడదు, తింటే ప్రాణాలకే ముప్పు.

మారుతున్న జీవన శైలి కారణంగా ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఇదే క్రమంలో గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలలో ఒకటి ఆహారం. అయితే మన దేశంలో ప్రతి ఏడాది గుండెపోటు, స్ట్రోక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండె వైఫల్యం, ట్రిపుల్ వెసల్ డిసీజ్ వంటి రోగాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. అందుకే ఈ రోగాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. మనకు కూడా ఇలాంటి రోగాలు రావొచ్చు.

ఇప్పటికే గుండె జబ్బులున్న వారికి ప్రాణాలకు ముప్పు ఎక్కువే. బెర్రీలు, ద్రాక్షలు.. హార్ట్ పేషెంట్లకు రాస్ బెర్రీ, స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు వంటి రకరకాల బెర్రీలు, ద్రాక్ష పండ్లు చాలా మంచివి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ పండ్లలో పెక్టిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులను నివారిస్తుంది. గుండె రోగులు వీటిని రోజూ తింటే వారి గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు.

సిట్రస్ పండ్లు.. సిట్రస్ పండ్లలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లతో పాటుగా సీజనల్ పండ్లను కూడా రోజూ తినండి. మీ రోజూ రెండు మూడు రకాల పండ్లను తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. ఆకు కూరలు.. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా.. ఇంతా కాదు. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో రోగాలను నయం చేస్తాయి.

అంతేకాదు ఈ ఆకుకూరలు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఆకు కూరల్లో కెరోటినాయిడ్లు, లుటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్ట్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలను హార్ట్ పేషెంట్లు రెగ్యలర్ గా తింటే మంచిది. టొమాటో..టమాటాలను మనం ప్రతి కూరలో వేస్తుంటాం. నిజానికి టమాటా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. టమాటాలు తింటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మొత్తంగా టమాటా పరోక్షంగా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిని కూరల్లోనే కాకుండా పచ్చిగా తినడానికి ప్రయత్నించండి. లేదా జ్యూస్ గా చేసుకుని తాగండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker