ఎక్కువగా టీ తాగితే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే అది మీ జీవక్రియపై స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఇది శరీరం జీవక్రియ రేటుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం నోటి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుందని గుర్తుంచుకోండి. అయితే ప్రపంచవ్యాప్తంగా టీని ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. భారతదేశంలో చాలామందికి టీతోనే రోజు ప్రారంభమవుతుంది. ఏ వీధికి వెళ్లినా అక్కడ ఒక టీ స్టాల్ కనిపిస్తుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పరిమిత మొత్తంలో టీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటు వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. అయితే ఈ రోజుల్లో కల్తీ, నకిలీ టీ ఆకులు ప్రజల ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. కల్తీ టీ ఆకులే కాకుండా చాలా చోట్ల వాడిన టీ పొడిని ఆరబెట్టి మళ్లీ ప్యాకింగ్ చేసి మార్కెట్లలో సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు అందులో రకరకాల రసాయనాలు కలుపుతున్నారు.
వీటి వినియోగం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. నకిలీ టీ ఆకులు శరీరానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి టీ ఆకులను రోజూ తీసుకుంటే కాలేయ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నకిలీ టీ ఆకులు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయి. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యకు టీ ఒక కారణం అని పలు పరిశోధనల్లో తేలింది.
రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. మోతాదుకు మించి తాగితే.. ఎముకల పటుత్వంలో సమస్యలు వస్తాయి. ఎముక తొందరగా అరిగిపోతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. శరీరంలోని ఐరన్ పై ప్రభావం చూపిస్తుంది. టీ తాగడం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. పన్నెండు ఏండ్లలోపు పిల్లలకు అస్సలు టీ తాగించకూడదు.