హైబీపీ పేషెంట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ వీటిని తినకండి. ఎందుకంటే..?
రక్తపోటు 140/90 ఎంఎం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే హై బీపీగా పరిగణిస్తారు. దీనిని పట్టించుకోకుండా వదిలేస్తే గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు అధికం. ఆరోగ్య అలవాట్ల వల్ల చాలామంది హై బీపీ బారినపడుతుంటే.. అవేవీ లేకపోయినా కూడా కొంతమంది ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. అయితే శీతాకాలంలో చాలామంది వేయించిన ఆహారాలని ఎక్కువగా తీసుకుంటారు.
వీటివల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది. అధిక బీపీ వల్ల గుండెపోటు సంభవిస్తుంది. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణం కూడా పోతుంది. ఈ పరిస్థితిలో మీరు రక్తపోటును అదుపులో ఉంచుకోవాలనుకుంటే కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల హైబీపీ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఊరగాయ అధిక బీపీ ఉన్నవారు ఊరగాయ తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.
దీనివల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. హై బీపీ పేషెంట్లు కచ్చితంగా ఊరగాయలకు దూరంగా ఉండటం మంచిది. ప్రాసెస్ చేసిన మాంసం ప్రాసెస్ చేసిన మాంసంలో సోడియం అధికంగా ఉంటుంది. అందువల్ల అధిక బీపీ రోగులు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఆహారం నుంచి మినహాయించడం మంచిది.
తీపి పదార్థాలు అధిక బిపిలో ఎక్కువ స్వీట్ తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఎక్కువ చక్కెర తీసుకోవడం ఊబకాయం, దంత సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే మిఠాయిలు ఎక్కువగా తినడం మానుకోండి. పిజ్జా, చిప్స్ హై బీపీ ఉన్నవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బీపీ పేషెంట్లు పిజ్జా, చిప్స్, స్నాక్స్ వంటివి తినకూడదు. దీంతో సమస్య మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే సోడియం అధిక బీపీ సమస్యను మరింత పెంచుతుంది.