టీ, కాఫీలు తాగే ముందు ఖచ్చితంగా నీరు తాగాలి, ఎందుకంటే..?
మీరు టీ కి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల, ఇది యాసిడ్ ఉత్పత్తి అరికడుతుంది, యాసిడ్ స్థాయిలను పలుచన చేయడమే కాదు, కడుపుపై నష్టాన్ని తగ్గిస్తుంది, అధిక ఆమ్ల స్థాయి కారణంగా దంతాలపై టీ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే టీ, కాఫీలలో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
అందువల్ల ఈ పానీయాలకు ముందు నీళ్లు తాగితే మేలు. కనీసం 10-15 నిమిషాల ముందు నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది అనేక వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుతుందట. టీ, కాఫీ తాగితే దంతాలు పుచ్చిపోతాయనే భయం చాలా మందిలో ఉంటుంది. వీటిలో ఉండే టానిన్.. దంతాల రంగును దెబ్బతీస్తుంది.
వాటికి ముందు నీరు త్రాగటం వల్ల దంతాలకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నీరు దంతాలకు రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఖాళీ కడుపుతో టీ-కాఫీ తాగడం వల్ల అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే ఎసిడిటీ సమస్య మొదలవుతుంది. ఇది మీ కడుపుకు హాని కలిగిస్తుంది. ఈ సమస్యను నివారించడానికి.. టీ, కాఫీ తాగడానికి 15 నిమిషాల ముందు నీరు త్రాగాలి.
తద్వారా అల్సర్ల ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. టీ-కాఫీకి ముందు నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇలా నీరు తాగడం వల్ల శరీరంలో పోషకాలకు ఎలాంటి లోటు ఉండదు.