ఈ పండ్లు తింటే చాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. అయితే ఆరోగ్యం పట్ల వహించే అజాగ్రత్త కారణంగా రోగాలు పట్టి పీడిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. దీన్ని లిపోప్రోటీన్ లేదా ఎల్దీఎల్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా ధమనుల్లో పేరుకుపోతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం, తాజా పండ్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడంతో పాటు కొన్ని సార్లు మందులు తీసుకోవడం వల్ల కూడా అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. తాజా పండ్లు తినడం వల్ల శరీరంలోని కొవ్వుని కరిగించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పండ్లు యాపిల్.. పెక్టిన్ తో ప్యాక్ చేయబడి ఉంటుంది. కరిగే ఫైబర్ గుణం ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ని తగ్గించే ఉత్తమ పరిష్కారం. ఇందులోని పాలీఫెనాల్స్ కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి.
బెర్రీలు.. స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ వంటి సీజనల్ పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ ఆక్సీకరణ హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. బెర్రీల్లోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాల వల్ల గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడే బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. నారింజ.. నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. గుండెకి మేలు చేసి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
అవకాడో.. ఒలిక్ యాసిడ్ పవర్ హౌస్ అవకాడో. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని నిరోధించడంలో సహాయపడుతుంది. వీటినో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అరటి.. అరటిపండలులో విటమిన్లు, ఖనిజాలతో పాటు సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలతో నిండి ఉంటుంది. అరటిపండ్లు పొటాషియం, ఫైబర్ మంచి మూలం. అవి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.