రాత్రిపూట చెమటలు పట్టడం ఈ వ్యాధులకు సంకేతం కావొచ్చు.
ఎటువంటి వైద్యపరమైన కారణం లేకుండా శరీరంలో అధికంగా చెమట పట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. క్షయ వ్యాధి ఉన్నవారికి రాత్రిపూట ఎక్కువగా చెమట పడుతాయి. అయితే క్యాన్సర్ బాధితుల్లో రాత్రిపూట చెమటలు పట్టే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. ‘చెమట’ అనేది శరీర ఉష్ణోగ్రతను సమతుల్య పరిచేందుకు శరీరంలో సహజంగా చోటుచేసుకొనే కూలింగ్ ప్రక్రియ. ఇది ప్రతి ఒక్కరికి ప్రతి రోజూ నిరంతరం జరిగేదే. ఈ లక్షణాలు కనిపించిన క్యాన్సర్‌గా భావించాలి..
కారణం తెలియని నొప్పి..అన్ ఎక్స్ ప్లేయిన్డ్ నొప్పి ఉంటుంది. సహజంగానే వయసు పెరిగే కొద్దీ నొప్పి భరించే శక్తి సన్నగిల్లుతుంది. నొప్పి ఎందుకు? ఎక్కడో చెప్పటం వీలు కానీ సమయంలో ఏదో జరగకూడనిది జరుగుతోందని గుర్తించాలని క్యాన్సర్ పరిశోధకులు చెబుతున్నారు. బరువు తగ్గడం..సాధారణంగా బరువులో చిన్నచిన్న మార్పులు సహజమే. కానీ ఎలాంటి ప్రయత్నం లేకుండా బరువు తగ్గుతూ పోతున్నారంటే అది నిపుణుల దృష్టికి తేవాల్సిన విషయమని గుర్తించాలి.
ఇది అన్నవాహిక, జీర్ణాశయం, ఊపిరితిత్తుల క్యాన్సర్ల వల్ల కావచ్చు అని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అభిప్రాయపడుతోంది. కణితి లేదా వాపు.. శరీరంలోని ఏ భాగంలో నైనా కణితులు ఏర్పడడం, లేదా వాపు రావడం జరిగితే కచ్చింతంగా ఒకసారి వైద్య సలహా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా బాహుమూలలు, పొట్ట, ఛాతి, రొమ్ము, వృషణాల్లో వచ్చే వాపు ను కానీ కణితి ని కానీ అసలు నిర్లక్ష్యం చెయ్య కూడదు. అలసట.. తగినంత పోషణ లేకపోవడం, పని ఒత్తిడి, నిద్ర లేమి వల్ల అలసటగా ఉండొచ్చు. కానీ స్పష్టమైన కారణం లేకుండానే తరచుగా అలసి పోతుంటే మాత్రం కీడు శంకించాల్సిందే.
లుకేమియా, లింఫోమా, మల్టీపుల్ మైలోమా వంటి రక్తానికి సంబంధించిన క్యాన్సర్ల లక్షణం కూడా అయి ఉండవచ్చు. ఈ క్యాన్సర్లు బోన్ మారో లో ప్రారంభం అవుతాయి కనుక ఎర్రరక్త కణాల ఉత్పత్తి తగ్గి ఆక్సిజన్ తగినంత అందక పోవడం వల్ల ఇలా నీరసించి పోతారు. చర్మంలో మార్పులు.. మొటిమ లేదా పుట్టుమచ్చవంటిది లేదా ఏదైనా పుండు నయం కాకపోయినా నొప్పి లేకుండా ఉన్నా సరే కచ్చితంగా దాన్ని డాక్టర్ దృష్టికి తీసుకురావాలి. కొత్తగా పుట్టు మచ్చలు ఏర్పడడం లేదా ఇప్పటికే ఉన్న పుట్టు మచ్చులయినా సరే పరిమాణం,
ఆకారంలో లేదా దురద గా ఉండడం లేదా రక్తం రావడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. మింగడంలో ఇబ్బంది.. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండానే ఇతర ఏకారణం లేకుండానే మింగడానికి ఇబ్బందిగా ఉంటే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. మింగడంలో కష్టం అంటే అన్నవాహిక క్యాన్సర్ కావచ్చు. జీర్ణ సమస్యలు..అకారణంగా అసిడిటీ, గుండెల్లో మంట, ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండడం వంటి లక్షణాలు కొన్ని సార్లు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రారంభంలో కనిపిస్తాయి. కనుక నిర్లక్ష్యం తగదు.