వయాగ్రా వాడితే మన శరీరానికి ఎంత మంచిదో తెలుసా..?
వయాగ్రా ఒక అల్లోపతి ఔషధము. దీని అసలు పేరు సిల్డినాఫిల్ సిట్రేట్ . పురుషుల్లో అంగస్తంభన లోపాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక మందు ఇది! అమెరికా ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చి 2014 నాటికి సరిగ్గా పదేళ్లవుతోంది. ఈ దశాబ్దకాలంలో అంతర్జాతీయంగా ఇది సృష్టించిన సంచలనానికి అంతులేదు.
అయితే వయాగ్రాలోని PDE 5 క్యాన్సర్ కణితి వృద్ధి చెందకుండా చేస్తుంది. సౌతాంప్టన్ బృందం ల్యాబ్‌లోని క్యాన్సర్ కణాలపై, ఎలుకలపై PDE5 నిరోధక మందులను పరీక్షించారు. వయాగ్రా వాడిన ప్రతి 75 కేసులలో కీమోథెరపీ ప్రభావవంతంగా ఉందని నిపుణులు తెలిపారు.. వయాగ్రా ఎంత వరకు పని చేస్తుందనే దాని మీద ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు..
ప్రస్తుతం ఎలుకల మీద పరీక్షిస్తుండగా త్వరలోనే మానవుల మీద కూడా పరీక్షలు ప్రారంభించాలని బృందం తెలిపింది..ఇది విజయవంతం అయితే ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి చికిత్స చేయవచ్చు. ఇతర వ్యాధులకి పని చేసే మందులు క్యాన్సర్ చికిత్సకు కూడా ప్రభావవంతంగా ఉంటాయా లేదా అనే దాని మీద మరింత పరిశోధనలు చెయ్యడానికి ఆసక్తిగా ఉన్నామని నిపుణుల బృందం వెల్లడించింది.
అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు..బరువు తగ్గడం.. ఆహారం మింగడం కష్టంగా మారడం.. రొమ్ము ఎముక నొప్పి.. గొంతు బొంగురు పోయి దగ్గు రావడం.. అజీర్ణం, గుండెల్లో మంట.. ఎక్కువగా ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం.. ఈ వ్యాధి చివరి దశకి చేరితే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం. క్యాన్సర్ కణితి పరిమాణాన్ని బట్టి పొట్టలో కొంత భాగం తొలగించాల్సి కూడా వస్తుందని వైద్యులు అంటున్నారు.