రోజూ ఉదయాన్నే ఉప్పు నీటితో పుక్కిలిస్తే అద్భుత ప్రయోజనాలు.
రోజూ ఉప్పు నీటిని నోటిలో వేసుకుని పుక్కిలిస్తుంటే ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయి. ఇలా చేయడం ద్వారా గొంతు సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు దూరం అవుతాయి. రోజూ బ్రష్ చేసిన తర్వాత నోటిలో ఉప్పు నీటిని వేసుకుని పుక్కిలించడం వల్ల నోటిలోని బాక్టీరియా, సూక్ష్మక్రిములు చనిపోతాయి. అయితే అయితే అతిగా ఇబ్బంది పెట్టి సమస్య గొంతునొప్పి దానికోసం హాస్పిటల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు.
మన వంటింట్లో ఉండే అధికంగా వినియోగించడం వలన ఎన్నో వ్యాధులు వస్తాయి. అన్న సంగతి అందరికీ తెలిసింది. అయితే నిర్ణీత పరిమాణంలో వాడితే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.. ఉప్పు నీటిని గొంతులో వేసుకొని బాగా పుక్కిలించడం వలన ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు గొంతు నొప్పి ఉన్న ఉప్పు మీరు గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. కేవలం గొంతు నొప్పి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఇలా చేయడం మంచిదని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు.
గొంతులో ఉండే బ్యాక్టీరియలు, వైరస్ లు లాంటి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు బారి నుంచి కాపాడుతుంది. ఆసిడ్స్ లెవెల్స్ ను తటస్థంగా ఉంచుతుంది. దీని ఫలితంగా పిహెచ్ లెవెల్స్ ను సమతుల్యం చేస్తుంది. ఇలా చేయడం వలన నోటిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోయి నోరు దుర్వాసన లేకుండా ఉంటుంది. ఉప్పు నీటిని పుక్కలించడం వలన నోటిలో పుండ్లు, పొక్కులు, ముక్కు దిబ్బడ తగ్గుతాయి. ఇలా ఈ విధంగా నిత్యం చేస్తే అవన్నీ తగ్గిపోయి నోరు చాలా ఫ్రెష్ గా ఉంటుంది.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్లు నిత్యము మూడుసార్లు ఈ ఉప్పునీటిని గొంతులో వేసుకొని పుక్కిలించడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. చిగుళ్ళు నుంచి రక్తస్రావం వాపు ఉన్నవారు అలాగే పంటి నొప్పితో ఇబ్బంది పడే వారికి గొప్ప ఉపయోగాలు కలిగుతాయి. బ్యాక్టీరియాలు, వైరస్ లు గొంతులో చేరడం వలన గొంతులో ఉన్న ట్యాన్సిల్ను వాపుకి గురవుతూ ఉంటాయి. అప్పుడు ఆహారం తీసుకోవాలన్న ,ద్రవాలను తీసుకోవాలన్న చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఉప్పు నీటిని గొంతులో వేసుకొని పుక్కలించడం వలన ఈ ఇబ్బంది నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.