జలుబు చేసినప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పనులు చేయకండి. ఎందుకంటే..?
సూక్ష్మక్రిములను ముక్కు ద్వారా పీల్చుకోవడంతో జలుబు మొదలవుతుంది. లక్షణాలు సాధారణంగా 2 లేదా 3 రోజుల తర్వాత ప్రారంభమవుతాయి. 2 నుండి 14 రోజుల వరకు ఉంటాయి. చేతులు కడుక్కోవడం, జలుబు ఉన్నవారికి దూరంగా ఉండడం వల్ల జలుబు రాకుండా ఉంటుంది. అయితే జలుబు చేసినప్పుడు మీ వెంట ఏప్పుడు కూడా కర్చీఫ్ని క్యారీ చేయాలి. దగ్గు, తుమ్ములు వస్తున్నప్పుడు కర్చీఫ్ని అడ్డు పెట్టుకుంటే మంచిది.
మీరు ఇలా చేయడం వలన వేరొకరికి మీ ద్వారా జలుబు రాదు. జలుబుతో బాధపడేవాళ్ళకి కొన్ని జాగ్రత్తలు.. జలుబు అనేది అందరికి ఒకేలా ఉండదు. అంటే కొంతమందికి కేవలం జలుబు మాత్రమే ఉంటుంది. అలాగే మరికొందరికి జలుబుతో పాటుగా దగ్గు, తుమ్ములు కూడా వస్తూ ఉంటాయి.అయితే మన పెద్దవాళ్లు జలుబు చేసినప్పుడు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు.
అయితే ఆ చిట్కాలను వయసుని బట్టి పాటించాలి. ఎందుకంటే పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు.అలాగే జలుబు చేసినవారు చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు. అలా ఉంటే జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. జలుబు ఉన్నవారు ఇలా చేయకండి.. ఏసీలు., కూలర్ల గాలికి దూరంగా ఉండాలి. ఇంకా జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్ధాలు తినొద్దు. చల్లని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.
చెవులని కవర్ చేస్తూ ఉండాలి. దూదిని కానీ లేదంటే తలకి కాప్ గాని ధరించాలిఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.తలస్నానం చేసినప్పుడు వేడి నీళ్లు ఉపయోగించాలి. అలాగే జుట్టు త్వరగా ఆరడానికి డ్రయ్యర్స్ వాడడం మంచిది. లేకపోతే తల తడిగా ఉండి జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది.వెల్లుల్లి, అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్ తాగినా మంచి ఫలితం ఉంటుంది.