Health

బీరు తాగితే నిజంగానే బెడ్రూమ్‌లో రెచ్చిపోటారా..?

రోజూ మితంగా బీరు తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె జబ్బు ఉన్నవారు కూడా బీర్ తాగవచ్చట. అయితే అది అతిగా తాగకపోవడం మంచిది. ఆల్కహాలిక్ ద్రాక్ష రసం, వైన్ కంటే బీర్లో ఎక్కువ ప్రోటీన్, విటమిన్ బి ఉంటుంది. బీర్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి వివిధ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. అయితే ‘మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.

మందు తాగితే అనారోగ్యం పాలవడం.. బాడీలోని ఏదో ఒక పార్ట్‌ చెడిపోవడం ఖాయం’ అని వైద్యులు చెబుతుంటారు. ఏదైనా ఒక మోతాదులో తీసుకోవాలని.. మించితే ప్రమాదమని సూచిస్తుంటారు. అది దాంపత్య జీవనానికీ విరుద్ధమని అంటుంటారు. అతిగా మద్యం తాగే వారు సెక్స్‌ని ఆస్వాదించలేరట. లిమిట్‌గా మెయింటెన్‌ చేసే వారే వయాగ్రాతో పనిలేకుండా సెక్స్‌లో రెచ్చిపోతారట.

ముఖ్యంగా బీరు తాగే వారు బెడ్రూమ్‌లో సెక్స్‌లో ఎంజాయ్‌ చేస్తారట. బీరు తాగితే పొట్టరావడం.. ఇతరత్రా ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయంటారు. కాకుంటే మరీ ఎక్కువగా కాకుండా లిమిట్‌గా తాగితే బీరు మంచిదేనట. ఒక అధ్యయనం ప్రకారం 500 మిల్లీ లీటర్లు లేదా ఒక చిన్న గ్లాసు వైన్ తాగితే మగవాళ్లలో నపుంసకత్వం బారినపడే ప్రమాదాలు 34 శాతానికి తగ్గాయట.

అదే మహిళలపై జరిపిన పరిశోధనల్లో మాత్రం వారు వైన్‌ తీసుకున్నా ఎలాంటి మార్పు కనిపించలేదట. పైగా సెక్స్‌ విషయంలో వారికి బీరుతో పనిలేదట. పురుషులదే ఫైనల్‌ అని అధ్యయనం తేల్చిందట. ఎలాగూ బీరు తాగితే మంచిదే అన్నారు కదా అని ఎక్కువగా వేస్తే కూడా ప్రమాదమేనని సూచిస్తున్నారు. అతిగా మద్యం తాగితే అంగస్తంభన సమస్యలూ వచ్చే అవకాశాలు ఉన్నాయట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker