డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?
డ్రాగన్ ఫ్రూట్ అనే పేరే చిత్రంగా ఉంటుంది. దీనిని సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తుంటారు. డ్రాగన్ అనేది చైనాలో పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ… శత్రువుల్ని సంహరిస్తుందనీ, అలాంటి డ్రాగన్స్ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. మరి ఆ పేరును ఈ పండ్లకు ఎందుకు పెట్టారంటే,
వీటి ఆకర్షణీయమైన రంగు, రూపురేఖల కారణంగా ఎన్ని పండ్లు ఉన్న డ్రాగన్ పండ్లను సులభంగా గుర్తు పట్టవచ్చు. అయితే డ్రాగన్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే.. మనకు వ్యాధులు లేని పోని రోగాలొచ్చే అవకాశం ఉంది. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచడానికి డ్రాగన్ ఫ్రూట్స్ ను తినండి. ఈ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయినప్పటికీ..దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నోఅనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉండే పదార్థాలు మలాన్ని మృదువుగా మారుస్తాయి. ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. అయినప్పటికీ.. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా సమస్యలు వస్తాయి.
కాబట్టి దీనిని ఎక్కువగా తినకండి. డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ.. దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ ను అధికంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉండదు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ను ఎక్కువగా తినకండి.