సత్యదేవ్ భార్య గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు.
ప్రస్తుతం అతడు హీరోగా నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘లవ్ మాక్‌టైల్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
అయితే హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. మరి మీ రియల్ లైఫ్ లో హీరోయిన్ ని పరిచయం చేయొచ్చు కదా అని తమన్నా సత్యదేవ్ ను అడగగా.. అంతేకాకుండా తమన్నా మాట్లాదుతు మీరు ఇంత స్టైలిష్ గా కనిపించడానికి ప్రధాన బలం కూడా ఆమెను అట కదా అని అడగగా..
దీని తర్వాత సత్యదేవ్ బేబీ అంటూ స్టేజి మీదకి తన భార్యను పిలవడం జరిగింది. దీంతో సత్యదేవ్ భార్య కొడుకు స్టేజ్ పైకి రాగానే.. వారిద్దరిని పలకరించింది తమన్నా. సత్యదేవ్ తన భార్య గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తన భార్య తనకు కాస్ట్యూమ్ డిజైనింగ్ తో పాటు, స్టేలింగ్ కూడా దీపికానే చేసిందంటూ తెలియజేశారు. దీంతో స్టేజి మీద తన భార్యకు కూడా కృతజ్ఞతలు తెలిపారు సత్యదేవ్.
దీపిక సత్యదేవ్ ఇద్దరిదీ కూడా ప్రేమ వివాహమే నట. సత్యదేవ్ సినిమాలకు దీపిక కాస్టింగ్ డిజైనర్‌గా వ్యవహరించడంతో ప్రస్తుతం సత్యదేవ్ భార్యకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.సత్యదేవ్ భార్యలో ఇంతటి టాలెంట్ ని చూసి అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.