Health

మైదా పిండి పదార్దాలు తింటే మీ శరీరంలో ఏమౌతుందో తెలుసా..?

గోధుమ పిండి వ్యర్థాల్లో ప్రమాదకర రసాయనాలు కలిపి రిఫైన్డ్ చేయడం ద్వారా… మైదాపిండి తయారవుతుంది. ఇందులో పోషకాలు, ఫైబర్, విటమిన్లు ఏవీ ఉండవు. ఇది ఈజీగా జీర్ణం అవుతుంది. అందువల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి.

అయితే మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతోకొంత‌ పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచుప‌దార్థం జీరో. కాబట్టి మైదా త్వర‌గా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది. దీనివ‌ల్ల పేగుల్లో పుండ్లు ప‌డే ప్రమాదం ఉన్నది. అవి ముదిరితే క్యాన్సర్ లాంటి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధుల‌కు దారితీస్తాయి.

మైదా పిండిని గోడ‌ల‌కు పోస్టర్లను అంటించ‌డానికి ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఎందుకంటే మైదాపిండిలోని జిగురు పోస్టర్లు గోడ‌కు గ‌ట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన ప‌దార్థాలను తిన్నప్పుడు అవి మ‌న పేగుల‌కు కూడా అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఉత్పత్తై ఇన్ఫెక్షన్‌ల‌ను క‌లుగ‌జేస్తాయి. మైదా పిండివ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి.

గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. మహిళలల్లో బ్రెస్ట్ సంబంధ‌ సమస్యలు ఉత్పన్నమ‌వుతాయి. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండ‌టంవ‌ల్ల పొట్ట వ‌స్తుంది. ప్రొటీన్‌లు కూడా నామమాత్రంగా ఉంటాయి. మైదాలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివ‌ల్ల ఒంట్లో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker