జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ చెప్పులు ఎందుకు వేసుకోరో తెలుసా..?
అనుదీప్ కె.వి. అంతేకాదు ఆయన ప్రవర్తనతో అంతకంటే ఎక్కువ ఫేమస్ అయ్యాడు ఈయన. ఇటీవల క్యాష్ ప్రోగ్రామ్ తో అనుదీప్ ఒకేసారి స్టార్ అయిపోయాడు .ఆయన ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా కూడా వారికి కావాల్సినంత కంటెంట్ ఇస్తుంటాడు.
అయితే తింగరిగా కనిపించే అనుదీప్ లో ఇంత విషయం ఉందా అని ప్రేక్షకులు తెల్లబోయారు. ఆయనకు చాలా విషయాల్లో లోతైన అవగాహన ఉందని తెలుసుకున్నారు. జాతిరత్నాలు హిట్ ఏదో గాలి వాటం కాదన్న అభిప్రాయానికి వచ్చారు. కాగా అనుదీప్ లో తెలుసుకోవాల్సిన ప్రత్యేకతలు ఇంకా ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అనుదీప్ చెప్పులు వాడరు. ఆయన ఎక్కడికైనా వట్టి కాళ్ళతోనే ప్రయాణం చేస్తారు. దీనికి ఒక బలమైన కారణం ఉందట. ప్రముఖ రచయిత క్లింట్ ఉబెర్ రాసిన ‘ఎర్తింగ్’ అనే మోస్ట్ సెల్లింగ్ పుస్తకాన్ని అనుదీప్ చదివాడట. ఆ పుస్తకం ప్రకారం లోకంలోకి సింథటిక్ వచ్చాక భూమికి, మనుషులకు కనెక్షన్ పోయిందట.
చెప్పులు ధరించడం ద్వారా భూమితో మనుషులు అనుబంధాన్ని, ఆరోగ్యప్రయోజనాలను కోల్పుతున్నారనేది అనుదీప్ నమ్మకమట. అప్పటి నుండి అనుదీప్ చెప్పులు ధరించడం మానేశాడట. కాగా అనుదీప్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. కాఫీ, జ్యూస్ వంటి ఆహార పదార్థాలు ఆయన ఒంటికి పడవట. ఘాటైన వాసనలు, కాంతివంతమైన లైట్స్ ఇబ్బంది పెడతాయట.