రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రోజులో జలుగు, దగ్గుకు తగ్గించే అద్భుతమైన చిట్కాలు.
చలికాలంలో కానీ ఈ దగ్గు, జలుబులు తొందరగా తగ్గవు. వెంటనే తగ్గాలి అంటే మెడిసిన్ కూడా టైమ్ తీసుకుంటుంది. వీటితో పాటు పలు అనారోగ్య సమస్యలు కూడా మొదలు అవ్వవచ్చు. అందుకే ముందు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందితే.. తరువాత మిగతా వాటికి అదుపులో పెట్టొచ్చు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
కాబట్టి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడాని పలు రకాల చిట్కాలను వినియోగించాని నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం.. ఈ సీజనల్ వ్యాధుకు మెంతులు తీసుకోవాలని ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జలుబు లేదా వైరల్ వంటి సమస్యలు నుంచి బయటపడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని కోసం మెంతి నీరు ఉపయోగించాలి. ఇలా జలుబులు, దగ్గులు ఉంటే కేవలం సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు పెర్కొన్నారు.
జలుబు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను వినియోగించాలి. దీని కోసం మీరు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే దగ్గు వల్ల వచ్చే గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా సులభంగా దగ్గు కూడా తగ్గుతుంది. జలుబు, దగ్గు ఉంటే తప్పకుండా మీరు పాలలో పసుపును వేసుకుని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షలు అధిక పరిమాణంలో ఉంటాయి.
ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తరచుగా దగ్గు లేదా శ్లేష్మం సమస్యలతో బాధపడేవారు తులసి ఆకులతో తయారు చేసిన టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం మీరు తాజా తులసి ఆకులను తీసుకుని వాటిని కప్పు నీటిలో వెసి మరిగించాలి. ఇలా చేయడం వల్ల సులభంగా దగ్గు, జలుబు సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీతో పాటు అందులో తేనెను వేసి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.