రాత్రి వేళా ఈ రోటీలు తింటే తొందరగా బరువు తగ్గుతారు.
నూనె తప్ప మిగిలిన అన్ని పదార్ధాలనీ కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తని ముద్దలా తయారు చేయండి. అన్ని పదార్ధాలూ బాగా కలిసేలాగా జాగ్రత్త తీసుకోండి. అయితే శనగ పిండితో తయారు చేసిన రోటీలు ఎక్కువగా దక్షిణ భారత ప్రజలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది ప్రస్తుతం గోధుమ రోటీకి బదులుగా శనగ పిండితో చేసిన రొట్టెలను తీసుకుంటున్నారు. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటే..
ఈ రోటీల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అయితే వీటిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గడమేకాకుండా అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ఉండే మూలకాలు జీర్ణవ్యవస్థ కూడా బలంగా మారుతుంది. రోటీలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. శనగపిండితో తయారు చేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్, ఇనుము అధిక పరిమాణంలో లభిస్తాయి.
బరువు తగ్గడానికి గోధుమపిండితో తయారు చేసిన రోటిలకు బదులుగా శనగపిండి తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా శనగ పిండిలో ఉండే పోషకాలు ఆకలిని నియంత్రించేందుకు సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ రోటీలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శనగపిండితో తయారు చేసిన ఆహారాలను తినడం వల్ల రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకంటే బెసన్ రోటీలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరం బలహీనత సమస్యలను తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీర ఒత్తిడి నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. శనగపిండితో తయారు చేసిన రోటీలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బెసన్ రోటీలో విటమిన్ బి, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు క్రమం తప్పకుండా వీటిని తీసుకోడం వల్ల సులభంగా రోగనిరోధక శక్తి పెరగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.