ఈ మసాలా టీ తాగితే చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలన్ని తగ్గిపోతాయి.
సాధారణంగా జలుబు-దగ్గు, జ్వరం ఉంటూనే ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. జలుబు, ఫ్లూ సమయంలో అలసట, నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎక్కువగా వస్తాయి. అయితే దేశవ్యాప్తంగా చలికాలం ప్రారంభమై..చలిగాలుల తీవ్రత పెరుగుతోంది.
చలికాలంలో ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తాయి. ఫంగస్, బ్యాక్టీరియా పెరగడం వల్ల రకరకాల వ్యాధులు తలెత్తుతాయి. చలికాలంలో ఇమ్యూనిటీ బలహీనమవడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు అధికమౌతాయి. ఈ పరిస్థితుల్లో మసాలా టీ అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. శరీరానికి చాలా మేలు చేకూరుతుంది. మసాలా టీ సాధారణ టీతో పోలిస్తే చాలా ప్రయోజనకరం. మసాలా టీతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
మసాలా టీలో చాలా రకాల మూలికలు, వేర్లు ఉపయోగిస్తారు. ఇందులో సాధారణ టీ కంటే ఎక్కువ పదార్ధాలు కలుపుతారు. ఇందులో టీ పొడితో పాటు తులసి ఆకులు, లవంగం, అల్లం, ఇలాచీ, దాల్చినచెక్క మిశ్రమ పౌడర్ వేయాలి. ఈ మసాలా టీ తాగడం వల్ల మీ అలసట దూరమౌతుంది. తక్షణ ఎనర్జీ లభిస్తుంది. ఇది తాగడం వల్ల శరీరంలో స్వెల్లింగ్ దూరమౌతుంది.
మసాలా టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగం. మసాలీ టీలో ఉండే అల్లం, దాల్చినచెక్క, ఇలాచీలో యాంటీ ఆక్సిడెంట్లు , ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. కేన్సర్ ముప్పు కూడా తగ్గతుంది. ప్రతిరోజూ మసాలా టీ తాగడం వల్ల కేన్సర్ వ్యాధితో పోరాడే సామర్ద్యం కలుగుతుంది. మసాలా టీతో జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలోని హార్మోన్స్ నియంత్రణలో ఉంటాయి.