రాత్రిళ్లు పదే పదే మూత్రనికి వెళుతున్నారా..? ఇది అదే కావొచ్చు.
అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు అలవాట్ల వల్ల రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకి వెళ్లాల్సి వస్తుంది. ధూమపానం, మద్యం సేవించడం, టీ-కాఫీ ఎక్కువగా తాగడం, టెన్షన్, ఆందోళనకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.
అయితే కొంతమందికి రాత్రిళ్లు పదే పదే మూత్రం వస్తుంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. మీకు ఇలాంటి లక్షణాలు కన్పిస్తే ఏ మాత్రం అలక్ష్యం చేయవద్దు. ఎందుకంటే మూత్రం ఎక్కువగా వస్తుందంటే..బ్లేడర్, కిడ్నీ, ఫిల్టరేషన్ ప్రక్రియలో సమస్య ఉన్నట్టే అర్ధం. శరీరంలో ఏదో ఒక భాగంలో సమస్య కారణంగా..పదే పదే మూత్రం వస్తుంటుంది. మీరు హఠాత్తుగా రాత్రిళ్లు పదే పదే మూత్రం వస్తుందంటే..మీ బ్లేడర్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లేడర్ లోపల రాళ్లు ఉంటే మూత్రం తరచూ వస్తుంటుంది.
మూత్రంలో అడ్డంకి ఏర్పడటం వల్ల ఇలా జరుగుతుంటుంది. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి పెరగడం ఓ సాధారణ సమస్య. ప్రోస్టేట్ గ్రంథి పెరిగితే మూత్ర ప్రవాహానికి బ్రేక్ పడుతుంది. దాంతో పదే పదే యూరిన్ వస్తుంటుంది. ఎక్కువ సార్లు మూత్రం రావడం డయాబెటిస్ కారణం కావచ్చు. డయాబెటిస్ ఎక్కువగా ఉంటే..రక్తంలో అధిక మోతాదులో గ్లూకోజ్ చేరుతుంది. ఫలితంగా కిడ్నీ ఎక్కువ గ్లూకోజ్ ఫిల్టర్ చేయడం, విసర్జించేందుకు ఎక్కువసేపు పనిచేస్తుంది.
కిడ్నీ వ్యాధుల్లో సాధారణంగా మూత్రం ప్రభావితమౌతుంది. కిడ్నీలో రాళ్లు, క్రానిక్ కిడ్నీ డిసార్డర్, కిడ్నీ డ్యామేజ్ వంటి సమస్యల కారణంగా పదే పదే మూత్రం వస్తుంటుంది. యూటీఐ ఇన్‌ఫెక్షన్ కారణంగా పదే పదే మూత్రం వస్తుంది. మూత్రాశయం, మూత్రమార్గంలో ఎక్కడ సమస్య ఉన్నా ఇలా అవుతుంది. మరోవైపు మూత్రం పోసేటప్పుడు నొప్పి కలుగుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి.