చనిపోవడానికి ముందు రోజు నైట్ సిల్క్ స్మిత ఎవరికీ కాల్ చేసిందో తెలుసా..?
సిల్క్ స్మిత గా ప్రసిద్ధురాలైన “విజయలక్ష్మి” ప్రముఖ దక్షిణాది నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200లకు పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి పాత్రలు పోషించింది. అయితే 1996 సెప్టెంబర్ 23 న, స్మిత తన చెన్నై అపార్ట్మెంట్లో చనిపోయింది. అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్ద పెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను బలి తీసుకుందని అన్నవారు కూడా లేకపోలేదు. అయితే తాజాగా సిల్క్ స్మిత మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు అప్పటి నటి అనురాధ. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో సిల్క్ స్మితతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిల్క్ స్మిత తాను ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లమన్నారు. అయితే ఎంత క్లోజ్‌గా ఉన్న స్మిత మాత్రం అన్ని విషయాలు అందరికీ చెప్పేది కాదన్నారు.
చనిపోవడానికి ముందు రోజు నైట్ సిల్క్ స్మిత తనకు కాల్ చేసిందన్నారు అనురాధ. అయితే తనను ఇంటికి రమ్మని అడిగిందన్నారు. అయితే ఆ సమయంలో తన భర్త బెంగుళూరు నుంచి వస్తున్నాడని.. పొద్దున్నే రానా అని తాను సిల్క్ స్మితతో చెప్పానన్నారు. సరే అయితే రేపు మార్నింగ్ వస్తావా అని తాను అడిగిందన్నారు. సరే వస్తాను.. బాబును స్కూల్‌కు పంపి వస్తానని.. సిల్క్ స్మితతో చెప్పానన్నారు. ఉదయం లేచి తన బిడ్దను స్కూల్‌కు రెడీ చేస్తుండగా.. సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుందన్న వార్త తెలిసిందన్నారు.
అయితే ఆమె బాడీని పోస్టుమార్టంకు తీసుకెళ్లడంతో.. ఆస్పత్రికి వెళ్లానన్నారు. అక్కడ సిల్క్ బాడీని చూసి చాలా బాధ కలిగిందన్నారు అనురాధ. అక్కడ స్ట్రెచర్‌పై సిల్క్ స్మిత డెడ్ బాడీపై ఈగలు వాలడం చూసి తనకు ఎక్కడ లేని బాధ,దుఖ: వచ్చాయన్నారు. ఆమె అందానికి,బాడీకి ఎంత క్రేజ్ ఉంది.. అలాంటి బాడీ నిర్జీవంగా మారితే… దానిపై ఈగలు వాలుతుంటే మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందనే చాలా ఏడుపు వచ్చేసిందన్నారు. సిల్క్ స్మిత డెడ్ బాడీని చూసి తనతో పాటు.. నటి శ్రీవిద్య కూడా ఏడ్చేశారన్నారు అనురాధ.
సిల్క్ స్మిత చాలా మొండిది అన్నారు. అన్నీ షేర్ చేస్తుంది.. అది కొన్నా.. ఇది కొన్నా అంటుంది. కానీ.. తన మనసులో బాధ మాత్రం ఎవరికి షేర్ చేయదన్నారు. సిల్క్ స్మిత మేకప్‌కు వన్ అండ్ ఆఫ్ అవర్ టైం తీసుకునేదన్నారు. ఎవరైనా తలుపు తడితే… మరో అరగంట ఆలస్యం చేసేదన్నారు. మిగతా నటులు మాత్రం కేవలం 40 నుంచి 45 నిమిషాల్లో మేకప్ వేసుకొని రెడీ అయిపోయేవాళ్లమన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ చాలా మారిపోయిందన్నారు అనురాధ. థియేటర్లు పోయి మల్టీ ప్లెక్సీలు వచ్చేశాయన్నారు కాస్ట్యూమ్ కోసం డిజైనర్స్ వచ్చేశారన్నారు. కార్వాన్ వ్యాన్‌లో కూడా అందుబాటులోకి వచ్చేశాయన్నారు.