Health

ఈ కాలంలో వీటిని తింటే పురుషుల్లో పవర్ రెట్టింపు అవుతుంది.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రోగ నిరోధక పెంచుకోవడమే కాకుండా.. ఇతర వ్యాధుల భారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన పోషకాలున్న పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఎండుద్రాక్షలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇందులో చక్కెర, కేలరీలు, అధికంగా ఉంటాయి. అయితే రుచికి తియ్యగా, కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష అంటే మనలో చాలా మందికి ఇష్టం. వీటిని చాలా చాలా మంది ఇష్టంగా లాగించేస్తారు.

అయితే, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక ఔషధ పోషక పదార్థాలు ఈ చిన్న పండ్లలో దాగి ఉన్నాయి. కిస్మిస్‌లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. పిల్లలకు రోజూ ఉదయాన్నే వీటిని తినడం అలవాటు చేస్తే వారి మెదడు చురుకుగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో చక్కెర, కేలరీలు, అధికంగా ఉంటాయి. కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి.

దీనిలో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచిది. అంతేకాకుండా వీటిలోని బోరాన్ అనే ఖనిజం మూలంగా ఎముకలకు సంబంధించిన ఆస్టియో పోరోసిస్‌ను రాకుండా కాపాడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలకు ఎండు ద్రాక్ష చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. ఎండుద్రాక్షలో రాగి, విటమిన్-B పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. వీటిని తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎండు ద్రాక్ష మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎండు ద్రాక్ష జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చలికాలంలో తీసుకోవడం చాలామంచిది.

దీనివల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు దరిచేరవు. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఒంట్లో నీరసం తగ్గుతుంది. ఉత్సాహంగా ఉంటారు. కిస్మిస్‌లను తినడం వల్ల లైంగిక జీవితం మెరుగుపడుతుంది. దీంతో.. మీ సంసార జీవితానికి ఈ కిస్మిస్ చక్కటి పరిష్కారం. వీటిని తినటం వల్ల సంతాన సాఫల్యత మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోలేరు. తద్వారా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు రోజువారిగా తగిన మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతాయి.

వీటిలోని ఫినాలిక్‌ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఎండుద్రాక్ష ఎప్పుడు తినాలంటే.. ఎండుద్రాక్షను ఎప్పుడైన తినవచ్చు. కానీ నానబెట్టిన ఎండుద్రాక్ష ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. నానబెట్టిన ద్రాక్షను తినడం వలన పోషక విలువ పెరుగుతుంది. నాన బెట్టిన ఎండుద్రాక్షను ఎందుకు తినాలి.. ఎండుద్రాక్ష కంటే నానబెట్టిన ద్రాక్షలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నానబెట్టిన ద్రాక్ష నీటిని తాగడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే.. ద్రాక్షలో ఉంటే పోషకాలన్ని ఆ నీటిలో కరిగిపోతాయి. అందుకే ఆ నీటిని తాగడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker