ఈ కాలంలో చుండ్రు పెరుగుతుందా..! నిమ్మ రసంతో ఇలా చేయండి చాలు.
చుండ్రు జుట్టులో ఎక్కువ సేపు ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని ఇంటి నివారణలు చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. మీకు కూడా చుండ్రు సమస్య ఉంటే.. నిమ్మకాయను ఉపయోగించడం వల్ల మీకు సహాయపడుతుంది. నిమ్మరసంలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ రోజుల్లో చుండ్రు సమస్యలను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. చుండ్రుపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు.. సుండ్రు సమస్య ఉన్నవాళ్లు ఈ నిమ్మకాయని ఉపయోగించండి. నిమ్మరసం జుట్టులోని దురదను తగ్గిస్తుంది.
నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియాలో యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు చుండ్రుని తగ్గించడంలో సహాయపడతాయి. అలోవెరా జ్యూస్ నిమ్మకాయ వినియోగం… దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే చుండ్రు సమస్యలు దూరం చేసుకోవచ్చు. కలమందరసం నిమ్మకాయను ఉపయోగించడం వల్ల చుండ్రు తగ్గుతుంది. మూడు చెంచాల కలమందరసం తీసుకొని దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపండి. తలకు పట్టించి 15 నిమిషాలు వరకు అలాగే ఉంచాలి. దీన్ని ఉపయోగిస్తే మీకు తేడా కనిపిస్తుంది. అలీవ్ నూనె నిమ్మరసం… అలీవ్ నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. చుండ్రు సమస్యను దూరం చేయడానికి అలీవ్ ఆయిల్ నిమ్మరసం వాడాలి. దీన్ని మీరు రెగ్యులర్గా ఉపయోగిస్తే మీకు చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు.
కొబ్బరి నూనె నిమ్మకాయ… జుట్టులో చుండు సమస్య ఉంటే కొబ్బరి నూనె నిమ్మరసం ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని దీనిలో నిమ్మరసం వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో తలకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మీద సుమారు గంట ఉంచండి. దీని తర్వాత జుట్టును నీటితో కడగాలి. జుట్టు నుండి చుండ్రు తగ్గించుకోవడానికి ఇతర ఇంటి నివారణలు రాత్రిపూట నూనె చేసే విధానం ఈ నూనె రాత్రంతా మీ తలపై ఉంచండి. చుండ్రు కోసం మరుసటి రోజు ఉదయం తలకు నిమ్మరసం పట్టించి 15 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి జుట్టు కడగడానికి చాలా వేడి నీటిని ఉపయోగించడం మానుకోండి.
కొబ్బరి నూనె చికిత్స కొబ్బరి నూనెను వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేడి చేసి జుట్టుకి పట్టించాలి. తర్వాత టవల్ను వేడి నీటిలో ముంచి ఆ తర్వాత టవల్ బయటికి తీసి వేడి టవల్ను తలకి చుట్టుకోవాలి. యాపిల్సైడర్వెనిగర్ ఆయిల్… చుండ్రు కోసం పండిన బొప్పాయి గుజ్జును, శెనగపిండి గుడ్డులోని తెల్ల సోనా మరియు నాలుగు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి వేస్ట్ లా తయారు చేసుకోండి. ఆపై ఆ పేస్టు తలకు అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయండి. మెంతు గింజలు… మెంతు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. వాటిని గ్రైండ్ చేసి పేస్టులా చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల అలీవ్ ఆయిల్ మందార ఆకులు పువ్వులు పేస్ట్ కలపండి. ఈ పేస్ ని తలకు పట్టించి 20 నుండి 30 నిమిషాల వరకు అలాగే ఉంచాలి ఆ తర్వాత నీటిలో పూర్తిగా కడగాలి.