Health

స్కిన్ లెస్ చికెన్, స్కిన్ చికెన్ లల్లో ఏది తింటే మంచిదో తెలుసా..?

ఆరోగ్యాన్ని కాపాడు కోవడం నిరోధక శక్తిని పెంచు కోవటం ఎలా అని వెతకడం ప్రారంభించారు. ఈ క్రమం లోనే మాంసకృత్తులు ఎక్కువగా తింటే ఆరోగ్యం గా ఉండవచ్చు అని అక్కడ ఎక్కడో సోషల్ మీడియాలో చూశారు ఇంత చూశాక ఇక మాంసం తినకుండా ఉంటారా..! అయితే కొవ్వు తక్కువగా ఉండడం, పోషక ఆహార పదార్థాలు అధికంగా ఉండడంతో పాటు శరీరానికి ఉపయోగం కలిగించే మ్యానోశాచురేటడ్ కొవ్వులు కోడి మాంసములో గణనీయంగా ఉంటుంటాయి. ఈ కొవ్వులు ఉండే సంబంధిత ఆరోగ్యానికి మంచి చేస్తూ ఉంటాయి.

చికెన్ తీసుకునేటప్పుడు స్కిన్ తో తినడం మంచిదా.? స్కిన్లెస్ తీసుకోవడం మంచిదా.? అనే ప్రశ్న ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. చికెన్ స్కిన్ లో 32 శాతం కొవ్వు ఉంటుంది. అంటే ఒక కిలో చికెన్ స్కిన్ తీసుకుంటే అందులో 320 గ్రాముల కొవ్వు ఉంటుందని పోషకాహార నిపుణులు తెలియజేయడం జరిగింది. చికెన్ స్కిన్ లో ఉండే కొవ్వులలో మూడింట, రెండింతలు అసంతృప్తి కొవ్వులు కలిగి ఉంటుంది. వీటినే మంచి కొవ్వుగా కూడా అంటుంటారు. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెరుగుపరచటంలో ఈ కొవ్వు చాలా ఉపయోగపడుతుంది. స్కిన్ తో తీసుకుంటే సహజంగా కంటే దాదాపు 50 శాతం క్యాలరీలను పొందవచ్చు.

170 గ్రాముల స్కిన్లెస్ చికెన్ ని తీసుకుంటే 284 క్యాలరీల శరీరంలోకి చేరుతాయి. ఎత్తుకు తగినంత బరువు ఉండి శారీరకంగా చురుగ్గా ఉండే మనుషులు దీనిని వండేటప్పుడు చికెన్ స్కిన్ అలాగే ఉంచి తినే ముందు స్కిన్ ని తీసేస్తే మంచిది. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వండేటప్పుడు చికెన్ ఫ్రై స్కిన్ ఉండడం వలన కూరకు తగిన రుచి కూడా ఉంటుంది అంటున్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి… కొంతమంది చికెన్ ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. వండడానికి ముందు ఫ్రిజ్ లో నుంచి తీసి వంట గదిలో పెడుతూ ఉంటారు. చాలామంది ఫ్రిజ్లో నుంచి తీసి బయటికి కొంతసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు.

అలా ఫ్రిడ్జ్ నుంచి తీశాక గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన చికెన్ మళ్లీ ఫ్రిజ్లో పెట్టకూడదని పోషక ఆహార వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆహార పదార్థాలు సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపడం కోసం చికెను ఫ్రిజ్లో నిల్వ ఉంచుతుంటారు. దాన్ని బయటకు తీసి సహజంగా ఉష్ణోగ్రతకు తెచ్చిన తర్వాత సూక్ష్మజీవులు మళ్లీ అధికమవడం మొదలుపెడతా యి. కాబట్టి ఒకసారి ప్రిజ్ నుంచి తీసిన చికెన్ను సాధారణ ఉష్ణోగ్రతకి తెచ్చిన ఆహార పదార్థాన్ని మళ్లీ ఫ్రిజ్లో ఉంచకూడదు. అన్ని రకాల మాంసాలకు ఇవే జాగ్రత్తలు పాటించాలి. అంటున్నారు పోషక ఆహార నిపుణులు. ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే చికెన్ వండిన తర్వాత దానిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker