Health

పిల్లల పొట్టలో నులిపురుగులు పోవాలంటే ఏం చెయ్యాలో తెలుసా..?

నులి పురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. ఈ వ్యాధి కారకాన్ని అస్కారియాసిస్‌ అంటారు , ఇవి పేగుల్లో నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవుల ఇవి నెలల్లో గుడ్లు, లార్వాలుగా వృద్ది చెందుతాయి. అయితే దాదాపు 85 శాతం మంది పిల్లల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని ఆరోగ్య సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం, కడుపులోనొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

అసలు ఈ నులిపురుగులు పిల్లల కడుపులోకి ఏ విధంగా ప్రవేశిస్తున్నాయి వాటి వల్ల తలెత్తే సమస్యలు, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం సర్వసాధారణం. మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని తింటే నోటి ద్వారా పొట్ట, పేగుల్లోకి నులి పురుగులు ప్రవేశిస్తాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, దుమ్ము ధూళి చేరిన కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల నులిపురుగుల సమస్య తలెత్తవచ్చు.

నులిపురుగులు పిల్లల ప్రేగులోకి చేరి వారు తీసుకునే ఆహారాన్ని శరీరానికి అందకుండా చేస్తాయి దాంతో పిల్లల పిల్లల పెరుగుదల లోపిస్తుంది. రక్తహీనత, కడుపు నొప్పి,తలనొప్పి,వాంతులు,సరిగా నిద్రపోకపోవడం వంటి లక్షణాలు కనపడతాయి. అయితే కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడేవారికి ఈ సులువైన చిట్కాలు ద్వారా నులిపురుగుల సమస్యను అధిగమించవచ్చు. ప్రధానంగా చిన్నపిల్లల చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజు వేడి చేసి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగించాలి.

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో క గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు. నులి పురుగుల సమస్యతో బాధపడే చిన్నపిల్లలకు వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది.రెండు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని తాపడం వల్ల కడుపులో నులి పురుగులను నివారించవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker