ఈ కాయను మీరు తరచూ తింటే మీ రోగాలన్నీ మటుమాయం.
శరీరానికి అవసరమైన అన్ని విటమిన్‌లను అందించే ఒక కూరగాయ గురించి మీకు చెప్పాలి. బొంత కాకర లేదా బోడ కాకర గురించి మీకు తెలిసే ఉంటుంది. దీనిని అడవి కాకర.. ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను బలపరుస్తుంది.
అయితే బోడ కాకరలో విటమిన్ సి, విటమిన్ ఏ ,విటమిన్ డి , విటమిన్ బీ 12, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులను, అలర్జీలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది.
బోడ కాకరలో సమృద్ధిగా ఉన్న లూటీన్ వంటి కెరోటినాయిడ్స్ అధిక కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడి హృదయ సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, కంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. బోడ కాకరకాయలు పోలెట్ అధికంగా ఉంటుంది ఇది శరీర కణాల ఎదుగుదలకు సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భస్థ శిశువు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. బోడ కాకరలో సమృద్ధిగా ఉన్న పీచు పదార్థం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబందకం, అజీర్తి , గ్యాస్టిక్ సమస్యలను తొలగిస్తుంది.
బోడ కాకర డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ ఇన్సులిన్ వ్యవస్థను మెరుగుపరిచి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తుంది. బోడ కాకరలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి సహజ యాంటీ యాక్సిడెంట్ గా పనిచేసే శరీరంలో చెడు మలినాలను తొలగించి అనేక క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తుంది. కిడ్నీ లో రాళ్ల సమస్యతో బాధపడే వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.