ఈ ఆయిల్ వాడి ఇంట్లోనే మీ చెవిని పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు.
స్విమ్మింగ్ సమయంలోనో లేదా స్నానం చేస్తున్నప్పుడో చెవిలోకి నీళ్లు చేరాయని మీరు భావించినట్లైతే, ఇదే మీ చెవిలో దురద అనే సమస్యకు కారణమైనట్లయితే ఈ చిట్కాను పాటిస్తే రిలీఫ్ లభిస్తుంది. గ్రావిటీకు పనిచెప్పండి రిలీఫ్ వరిస్తుంది. అయితే మన చెవులు.. ఇయర్ వాక్స్ అనే సహజమైన మైనపు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మన చెవులను రక్షిస్తుంది. దుమ్ము, ధూళి రానీయకుండా నిరోధిస్తుంది. అయితే చెవి వ్యాక్స్ పేరుకుపోతే.. వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదముంది.
అయితే ఉప్పు నీరు మీ చెవిలో పేరుకుపోయిన మైనపును మృదువుగా చేయడంలో సహాయం చేస్తుంది. తద్వారా మీరు దానిని సులువుగా శుభ్రం చేయవచ్చు. దీనికోసం మీరు.. గోరువెచ్చని నీరు తీసుకోండి. దానిలో ఉప్పు కలపండి. అందులో కాటన్ బాల్స్ ఉంచండి. మీరు ఏ చెవిని క్లీన్ చేయాలనుకుంటున్నారో.. దానిలో కొన్ని చుక్కలు వేయండి. మూడు నుంచి ఐదు నిమిషాలు నీరు దానిలో ఉండేలా పట్టుకోండి. ఆ వాటర్ బయటకు పోయేలా మీ తలను వంచండి. మెత్తబడిన డస్ట్ని సున్నితంగా క్లీన్ చేయండి. చెవులను క్లీనింగ్ చేయడానికి ఒక గొప్ప హోం రెమెడీ.
ఆలివ్ ఆయిల్ మీ చెవిని నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. చెవి పొరలను లైన్ చేయడంలో సహాయపడుతుంది. క్రిమినాశక లక్షణాలతో ప్యాక్ నిండి ఈ ఆయిల్.. చెవిలోని మైనాన్ని సజావుగా తొలగించడంలో మీకు సహాయం చేస్తుంది. మీ చెవిలో మూడు-నాలుగు చుక్కల గోరువెచ్చని ఆలివ్ నూనె పోసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. మీ తలను వంచి నూనె, మైనాన్ని తొలగించడానికి ఇయర్‌బడ్‌లను ఉపయోగించండి. బేకింగ్ సోడా పొడి.. గట్టిపడిన ఇయర్‌వాక్స్‌ను మృదువుగా చేయడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఇది సురక్షితమైనది. చెవి ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. బేకింగ్ సోడాను కొన్ని చుక్కల నీటిలో కరిగించి.. డ్రాపర్ సహాయంతో మీ చెవిలో పోయాలి. ఇది అధిక చెవి వ్యాక్స్‌ను బయటకు పంపుతుంది. పూర్తయిన తర్వాత మీ చెవులను మృదువైన కాటన్ క్లాత్‌తో శుభ్రం చేయండి. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండిన ఆపిల్ సైడర్ వెనిగర్ చెవిలోని హానికరమైన సూక్ష్మజీవులను చంపడానికి, తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే శిలీంధ్రాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటితో కలపండి. ఇయర్ డ్రాపర్ ఉపయోగించి మీ చెవిలో ఐదు నుంచి 10 చుక్కలు వేయండి. చుక్కలు చెవిలో ఐదు నిమిషాలు ఉంచి అనంతరం క్లీన్ చేయండి.