Health

ఈ మొక్క ఆకులు రెండు తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

ఉదయం పూట పరిగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సిలో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జీలకర్ర, పటికబెల్లం పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్లు కరిగి పోవడం లేదా రాళ్లు పడిపోవడం జరుగుతుంది. అయితే పిండి కూర ఆకును మనం పల్లెటూళ్లలో చాలాసార్లు చూశాం. దీనిని పాషాణభేది అని కూడా అంటారు. అంటే రాళ్లను కూడా కరిగిస్తుందని దీని అర్థం.

కొండపిండి చెట్టు అని, తెలగ పిండి చెట్టు అని కూడా పిలుస్తారు. అయితే పిండి కూర ఆకులో ఒక విశేషమైన గుణం ఉంది. కిడ్నీలు రాళ్లు అని వినగానే మనం చాలా భయపడుతుంటాం. కానీ ఈ పిండి కూర ఆకు ఆ రాళ్లను ఇట్టే కరిగించేస్తుందట. ఈ పిండి కూర ఆకులు పిడికెడు తీసుకుని పరిగడుపున మూడు రోజులపాటు తీసుకుంటే సరిపోతుందని చెబుతారు. అంత శక్తిమంతమైన ఔషధ గుణం ఉన్న ఆకు ఇది. అయితే పిండి కూర మొక్కను వేర్లతో సహా బాగా కడికి దానిని తురిమి అర లీటరు నీటిలో మరగబెట్టాలి. అలా దీనిలో సగం వరకు ఆవిరైపోయే వరకూ మరిగించాలి.

అప్పుడు దీనిని దించి వడబోసుకోవాలి. దీనికి పటిక బెల్లం ఒక 30 గ్రాములు, శిలాజిత్ పొడి ఒక 2 గ్రాములు కలుపుకోవాలి. ఇలా ప్రతిరోజూ పరగడపున.. అంటే ఖాళీకడుపుతో దీనిని తాగాలి. తాగిన తరువాత గంట సేపు ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. మూత్రాశయంలో, మూత్ర పిండాల(కిడ్నీ) లో ఉన్న రాళ్లు కరిగి మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. పిండి కూర మొక్కలు వేర్లతో సహా తెచ్చి బాగా కడిగి మెత్తగా దంచాలి. ఒక ముద్దలాగా చేసి ఒక గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది. సమపాళ్లలో పటిక బెల్లం కలపాలి. ఇప్పుడు దీనిని సన్నని మంటపై మరిగించాలి.

లేతగా పాకం వచ్చే వరకూ మరిగించాలి. ఆ తరువాత చల్లార్చి నిల్వ ఉంచుకోవచ్చు. దీనిని పెద్దవాళ్లయితే రోజుకు ఒకటి రెండు చెంచాలు, పిల్లలైతే అర చెంచా రోజూ తీసుకుంటే మూత్రపిండాల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. పిండి కూర ఆకును కూరగా వండుకొని తినవచ్చు. పప్పులో కూడా వేసుకోవచ్చు. తద్వారా మూత్రపిండాల్లో ఉన్న వ్యర్థాలు మూత్రం ద్వారా వెల్లిపోతాయి. పిండి కూర వేర్లు, ఆకులు, పువ్వులు ఎండబెట్టి పొడి చేసి నిల్వ ఉంచుకోవచ్చు. తేయాకు పొడికి బదులుగా దీనిని వేసుకుని టీ చేసుకుని తాగొచ్చు. తద్వారా మూత్రాశయ సంబంధిత వ్యాధులన్నీ నయమవుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker