తేగలు ఇలా చేసి తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
తేగలను ఉడికించి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని.. పిండి కొట్టి, కొబ్బరిపాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది. తేగల పిండిని గోధుమ పిండిలా చేసి.. రొట్టెల్లా చేసుకుని తినొచ్చు. అయితే ప్రకృతి ప్రసాదించిన చాలా ఆహారాలు శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో తేగలు కూడా ఒకటి. తాటికాయల్లో టెంకలు ఉంటాయి. వాటిని తీసి మట్టిలో పాతితే మొలక వస్తుంది. ఆ మొలకలే తేగలు. ఈ తేగల్ని కుండల్లో నింపి మంట మధ్యలో పెడతారు. లోపలున్న తేగలు బాగా ఉడుకుతాయి.
తరువాత ఆ కుండని తీసి లోపలున్న తేగలను బాగా దులిపి కట్టలు కడతారు. కాల్చిన తేగలు చాలా రుచిగా ఉంటాయి. తేగలు ఆరోగ్య ప్రయోజనాలు.. పొటాషియం, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పీచు, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. తేగల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన అధిక బరువు తగ్గటానికి సహాయపడతాయి. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన హీమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
తేగలలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెకు సమబందించిన సమస్యలను తగ్గిస్తుంది. అలాగే నరాల బలహీనత, నరాలలో అడ్డంకులు తొలగిస్తుంది. నరాలకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో రక్షక భటులైన తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతుంది. కాబట్టి తేగలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. తేగలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన డయబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. శరీరానికి చలవనివ్వడమే కాకుండా నోటిపూతను తగ్గిస్తుంది.