చలికాలంలో గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగర్తలు పాటించాల్సిందే.
చలికాలం వస్తు వస్తూ తన వెంటనే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను వెంట తీసుకువస్తుంది. మరీ ముఖ్యంగా చలి కాలం హృద్రోగులకు ఎంతో కీడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గుండె పోటు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే చలికాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఈ కాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. రక్త సరఫరా తగ్గడం వల్ల గుండెకు ఆక్సిజన్ తక్కువగా చేరుతుంది. దీంతో శరీరానికి రక్తం, ఆక్సిజన్‌ను అందించడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
చలి కాలం హృద్రోగులకు ఎంతో కీడు చేస్తుందని నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గుండె పోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు సమస్యల నుండి బయటపడవచ్చు. గుండె ముప్పు లేకుండా ఉండాలంటే చలికాలంలో జగ్రత్తలు.. చలి కాలంలో జ్వరాలు వస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ కాలంలో ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
చలి తీవ్రతను తట్టుకోవాలంటే ఉన్ని దుస్తువులను ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల, చేతులు, పాదాలను కవర్ చేస్తూ క్యాప్, గ్లౌజ్‌లు వంటి వాటిని ధరించాలి. చలికాలంలో అవసరమైతే తప్ప బయటకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం మంచిది. మరీ ముఖ్యంగా ఉదయం 8 గంటల లోపు, రాత్రి 6 గంటల తర్వాత బయట తిరగకుండా ఉండాలి. మద్యం వంటి వ్యసనాలకు బానిసలైతే వాటిని తగ్గించటం మంచిది. సాధ్యమైనంత వరకు మద్యాన్ని మానుకోవాలి. ఆల్కాహాల్ శరీరాన్ని వేడిపరుస్తుంది.
అపై చల్లటి వాతావరణం కారణంగా గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉంటుంది. చలికాలంలో రక్తపోటను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీలో అనూహ్య మార్పులు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. చలికాలంలో వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం చేయాలి. దీనివల్ల గుండె ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. వాకింగ్, జాగింగ్ వంటి వాటిని కొనసాగించాలి. చలికాలంలో నీరు సరిపడిన మోతాదులో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జామ పండ్లు, కూరగాయలను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.