Health

పుట్టగొడుగులు ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?

పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. పుట్టగొడుగులకు అధిక పోషక విలువలు ఉన్నాయి. ఇవి 92% నీటిని కలిగి ఉంటాయి. పుట్టగొడుగులలో కూడా అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే పుట్టగొడుగులు ఆహారంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

ఎందుకంటే, పుట్ట‌గొడుగుల్లో విటమిన్-బి, విట‌మిన్ డి, ఫోలేట్, థయమిన్, పొటాషియం, రాగి, సెలీనియం, ప్రోటీన్, ఫైబ‌ర్‌, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఇలా చాలా పోష‌కాలే ఉంటాయి. పౌష్టికాహారమైన పుట్టగొడుగులను ఎక్కువగా తినేవారికి మెదడు సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు రాకుండా మేలు కలుగుతుంది. విటమిన్స్, మినరల్స్, యాంటీ బాక్టీరియల్‌ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను కొన్ని రకాల మెడిసిన్స్‌ తయారీలో కూడా ఉపయోగిస్తారు. మాంసానికి సమానమైన పోషకాలను పుట్టగొడుగులు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. శ్వాసకోశ, పల్మనరీ, కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధులకు కూడా పుట్టగొడుగులు చెక్ పెడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

అయితే వీటిని అధిక మోతాదులో రోజువారిగా తీసుకుంటే మాత్రం కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టగొడుగులు అతిగా తింటే.. పుట్టగొడుగులలో సైలోసిబిన్ అనే సహజంగా లభించే సైకోయాక్టివ్, హాలూసినోజెనిక్, సైకెడెలిక్ ప్రోడ్రగ్ కాంపౌండ్ ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో సమస్యలకు దారితీస్తుంది. పుట్టగొడుగుల అతి వాడకం వల్ల విరోచనాలు, వాంతులు, వికారం వంటి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పుట్టగొడుగులు తినడం వల్ల పిల్లల్లో కండరాల బలహీనత సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తలనొప్పి తీవ్రం కావడం, ఆందోళన, కళ్లు తిరగడం వంటి సమస్యలు కూడా వీటిని తినడం వల్ల వస్తాయి.

పుట్టగొడుగులు శిలీంధ్రాలు కొందరిలో వీటిని తినటం వల్ల విరేచనాలు అవుతాయి. అలసట ఏర్పడి నీరసించి పోతారు. శక్తిస్ధాయిలు సన్నగిల్లుతాయి. కొందరిలో మత్తుగా ఉండి నిద్ర ఆవహిస్తుంది. ఆదమరచి నిద్రపోతారు. ఇలాంటి సమస్యలు మీకు కూడా తలెత్తితే, జాగ్రత్త పడటం మంచిది. పుట్టగొడుగులు తిన్న వారిలో స్కిన్ అలర్జీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. చర్మంపై దద్దుర్లు, ర్యాషెస్‌ వంటివి వస్తాయి. రంగు మారిన పుట్టగొడుగులను తినకూడదు. వంటల్లో వాడకూడదు. కాబట్టి పుట్టగొడుగులను అధికంగా కాకుండా చాలా మితంగా తినడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker