రాత్రి వేళ అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ప్రస్తుతం ఎన్నో కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. అందుకే ప్రజలు కూడా ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు మనకు తగినంత మంచి నిద్ర ఎంతో అవసరం. రాత్రి సరిగ్గా నిద్రలేకపోతే.. మరుసటి రోజూ ఏ పనీ సరిగా చేయలేం. మంచి నిద్ర కోసం ఆరోగ్యకమైన ఆహారం ఎంతో ముఖ్యం. అందుకే కొన్ని ఆహార పదార్థాలను రాత్రి పడుకోబోయే ముందు అస్సలు తినవద్దు.
అయితే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే పోషకాహారాలు తీసుకోవాలి. ఉదయం తినే వాటిపై కన్నేయాలి. రాత్రిళ్లు కొన్ని తినకుండా దూరం పెట్టాలి. మరికొన్ని ఆహారాలను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. అరటిపండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిది. ఆపిల్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలతో కలిపి తీసుకోకుండా చూసుకోవాలి. ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి.
వీటిని రాత్రిళ్లు తీసుకోకుండా చూడాలి. వెనువెంటనే శక్తిని అందించే గుణం బంగాళాదుంపల్లో ఉంటుంది. అందుకని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిది. మొలకెత్తిన విత్తనాలు, గింజలను ఎప్పుడు తీసుకున్నా ప్రయోజనం ఉటుంది. ఉదయం నిద్రలేవగానే మొలకెత్తిన గింజలు, విత్తనాలు తింటే పోషకాలు మెండుగా లభిస్తాయి. వరి అన్నం రాత్రి పూట తినకూడదు.
మధ్యాహ్నం మాత్రమే తినేలా చూసుకోవాలి. రాత్రి వేళ వరి అన్నానికి బదులుగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు తినడం మేలు. పెరుగును కేవలం పగటి వేళనే తినాలి. రాత్రి సమయంలో పెరుగు త్వరగా జీర్ణం కాదు. మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకని మధ్యాహ్నమే తినాలి. పాలు జీర్ణమయ్యేందుకు ఎక్కువ టైం అవసరం. అందుకని రాత్రి వేళ తీసుకోవడం ఉత్తమం.