ఇలా చేస్తే చలికాలంలో వచ్చే గొంతు ఇన్‌ఫెక్షన్లు వెంటనే తగ్గిపోతుంది.
వర్షంలో ఐస్‌క్రీం తినడం వల్ల గొంతులో వాపు, మంట వస్తుంది. జలుబు, దగ్గు గొంతును ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు గొంతులో అలెర్జీలు సంభవిస్తాయి. దీని కారణంగా తినడం, తాగడంలో సమస్య ఉంటుంది. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే మందులను తీసుకోకుండా ఎల్లప్పుడూ కొన్ని హోం రెమిడిస్‌ని పాటించండి. అయితే దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పితోపాటు జ్వరం ఉంటే వాతావరణంలో మార్పు, పెరుగుతున్న కాలుష్యానికి లక్ష్యంగా మారుతున్నట్లు గుర్తించాలి.
మారుతున్న వాతావరణం కారణంగా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కాలుష్యం, పగలు-రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కారణంగా ఎక్కువ మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. గోరువెచ్చటి నీటితో పుక్కిలించడం..గొంతు ఇన్‌ఫెక్షన్‌కు గురైన సందర్భాల్లో గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్‌ను తొలగించడానికి గార్గిలింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏర్పడే వాపును కూడా తగ్గిస్తుంది.
అలాగే నోటిలోని బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. పసుపు పాలు తాగడం.. పసుపులో క్రిమినాశక గుణాలు ఉంటాయి. పాలలో పెద్ద మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం ద్వారా ప్రయోజనాలు పెరుగుతాయి. పసుపు పాలు శరీరం నుంచి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కాలుష్యం కారణంగా గొంతులో నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. చల్లని వస్తువులు దూరం పెట్టడం..గొంతులో సమస్య వచ్చిన సమయంలో ముందుగా చలికి, చల్లటి వస్తువులకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు వేడి ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. చల్లని వస్తువులు తీసుకోవడం ద్వారా గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్య మరింత పెరిగే అవకాశాం ఉంటుంది.
సీ విటమిన్ ఆహారాలు తీసుకోవడం..శరీరంలో ఒకదాని తర్వాత మరొక సమస్య మొదలైందంటే.. రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితిలో వ్యాధుల నుంచి పోరాడేందుకు సీ విటమిన్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. సీ విటమిన్ ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయలు, నిమ్మకాయ, జామకాయలో లభిస్తుంది. ఆవిరి పట్టుకోవడం.. దగ్గు, జలుబు లేదా గొంతులో నొప్పి అనిపిస్తే ఖచ్చితంగా వేడి నీటి ఆవిరిని తీసుకోవాలి. నీటి ఆవిరి తీసుకోవడం వల్ల గొంతు, ముక్కులో ఇన్‌ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరికొన్ని వంటింటి చిట్కాలు..నాసికా రంధ్రంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోస్తూ మరో నాసికా రంధ్రం నుంచి బయటకు పంపేలా చూడాలి. ఇలా రెండు వైపులా చేయడం వల్ల శ్వాసనాళం పరిశుభ్రంగా మారి శ్వాస తీసకోవడంలో సమస్యలు ఉండవు. రాత్రిపూట పెరుగు, మజ్జిగ, ముల్లంగి, పెసరపప్పు తీసుకోకుండా చూసుకోవాలి. తులసి, అల్లం, లవంగంతో చాయ్ తాగాలి. అన్నంలోకి ఎండు మిర్చి పౌడర్‌ను కలుపుకుని తింటే మేలు జరుగుతుంది. పెసర పప్పు, కూరగాయలు, శనగపప్పు తినొచ్చు. నల్ల మిరియాలను తేనెతో కలిపి తీసుకుంటే ఛాతీలో పేరుకుపోయిన కఫం నయమవుతుంది.