Health

గోళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అది దేనికీ సంకేతమో తెలుసా..?

గోళ్ళ ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని, గోళ్లు పెళుసుగా ఉంటే వారు తరచుగా జబ్బు పడుతుంటారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది.. అయితే గోళ్ళ పై తెల్ల మచ్చలు ఉంటే కొన్నిరకాల అనారోగ్య సమస్యలకు దారి తీసేందుకు సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి చాలా మార్పుచెందింది. దీనికి తోడు అనారోగ్యకరమైన ఆహారం ప్రజలను అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తోంది.

అదే సమయంలో పేలవమైన జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్‌తో సహా గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతోంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుదల కారణంగా ఊబకాయం, అధిక రక్తపోటు ప్రమాదం కూడా ప్రజలలో పెరుగుతుంది. సాధారణంగా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మీ గోళ్ళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పొరపాటున కూడా విస్మరించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గోర్లు పసుపు రంగులో కనిపించడం.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు మీ గోళ్ల రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని సూచిస్తుంది. దీనివల్ల గోళ్ల రంగు పసుపు రంగులోకి మారడం లేదా గోళ్లలో పగుళ్లు ఏర్పడడం ప్రారంభమవుతుంది. అంతే కాదు మీ గోళ్ల పెరుగుదల కూడా ఆగిపోతుంది. చేతుల్లో నొప్పి.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిన వెంటనే.. ఇది చేతుల రక్తనాళాలను మూసివేయగలదు.

దీనివల్ల చేతుల్లో నొప్పి మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో మీకు కూడా చేతుల్లో నొప్పి సమస్య ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. చేతుల్లో జలదరింపు.. శరీరంలోని కొన్ని భాగాలలో రక్త ప్రసరణను అడ్డుకోవడం వల్ల చేతుల్లో జలదరింపు కనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం కారణంగా రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. దీంతో చేతుల్లో జలదరింపు వస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker